2019 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కలిసి పోటీ చేస్తున్నట్టు గత కొద్ది రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తగ్గట్టు అధినేతల వ్యవహారశైలి కూడా అలాగే ఉంది. ఎన్నికలకు ఇంకా 7 నెలల సమయం మాత్రమే ఉండగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షడు రఘువీరారెడ్డి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. అంతేకాదు వచ్చే నెల 16 నుంచి 31వరకు రాష్ట్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ప్రజల్లో మార్పు వచ్చిందని అన్నారు. ఏపీలో త్వరలో ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమం చేపడుతున్నట్లు రఘువీరా ప్రకటించారు. కర్నూలు జిల్లాలో త్వరలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నట్టు అయన స్పష్టం చేశారు.