ఏపీలో ఐటీ దాడులపై మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోడీ ఆపరేషన్ గరుడలో భాగంగానే ఆంధ్రులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని నిలదీసినందుకు ఆంధ్రప్రదేశ్‌పై మోడీ కక్ష గట్టారని విమర్శించారు. కడప ఉక్కు...ఆంధ్రుల హక్కు అని అన్నందుకే ఎంపీ సీఎం రమేష్ ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని లోకేష్ ట్వీట్ చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా హోదా సాధనలో వెనక్కి తగ్గేది లేదన్నారు. కేంద్రం మెడలు వంచుతామని హోదా సాధిస్తామని ట్విట్టర్‌లో లోకేష్ స్పష్టం చేశారు.