బ్రేకింగ్ : ఏపీ బీజేపీకి షాక్.. టీడీపీలోకి కీలకనేత.. ఎంపీ టికెట్ ఖరారు!
కర్ణాటక ఎన్నికల సమీపిస్తున్న వేళ బీజేపీకి షాక్ తగిలింది. ఏపీకి చెందిన బీజేపీ కీలకనేత రఘురామా కృష్ణం రాజు బీజేపీకి రాజీనామా చేశారు.శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు రఘురామా కృష్ణం రాజు స్పష్టం చేశారు. గత కొంత కాలంగా బీజేపీ అధిష్టానంపై కినుకు వహించిన అయన ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చలేదనే అసంతృప్తి కారణంగా పార్టీ మారుతున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలావుంటే టీడీపీలో ఆయనకు ఎంపీ టికెట్ ఖరారు చేసినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆయనను నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం యోచిస్తోంది. ఇటీవల బీజేపీనుంచి క్రమంగా నేతలు జారిపోతున్నారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జగన్ సమక్షములో వైసీపీలో చేరగా.. రేపో మాపో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి టాటా చెప్పాలని అనుకుంటున్నారు.