చంద్రబాబుకు అమిత్‌షా లేఖ

Update: 2018-03-24 05:48 GMT

ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రంగా పూర్తి స్థాయిలో నెరవేర్చిందన్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా. సీఎం చంద్రబాబు రాసిన లేఖకు సమాధానంగా లేఖ రాసిన ఆయన ఏపీ అభివృద్ధికి మోడీ పూర్తిస్థాయిలో సహకరించారన్నారు. ఏపీకి సంబంధించిన ఏ విషయంలోనూ వెనకడుగు వేయలేదని, రాష్ట్రంలో 3 ఎయిర్‌ పోర్టులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, నూతన రాజధాని, నిధులు కేటాయింపుల అంశాలను ప్రస్థావించిన ఆయన ఎన్డీయే నుంచి బయటకు రావడంతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆ లేఖలో పేర్కొన్నారు. 
 

Similar News