అమ‌లాపాల్ కు బెయిల్ మంజూరు

Update: 2018-01-17 19:58 GMT

హీరోయిన్ అమ‌లాపాల్  కు బెయిల్ మంజూరు అయ్యింది.  కేర‌ళ‌లో రూ. కోటి రూపాయ‌ల విలువ చేసే కారు కొనుగోలు చేసిన అమ‌లాపాల్ రిజ‌స్ట్రేష‌న్ మాత్రం పాండిచ్చేరిలో చేయించింది. స‌మాచారం తెలుసుకున్న కేర‌ళ  ట్రాన్స్ పోర్టు అధికారులు 430, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు హాజ‌రు కావాల‌ని సూచించారు. కానీ అమ‌లా పాల్ కోర్టులో హాజ‌రు కాకుండా ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు జ‌రిపింది.  దీంతో కేర‌ళ కోర్టు క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తర్వాత కేసు పరిశీలిస్తామని పేర్కొంది. దీంతో అమలాపాల్‌ సోమవారం తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల వద్ద లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆమె తప్పుడు పత్రాలు చూపినట్లు అంగీక‌రించింది. కాగా ముందుగానే అమలా హై కోర్టులో బెయిల్ కోరగా తిర‌స్క‌రించిన న్యాయస్థానం..కేసు విచార‌ణ చేప‌ట్టి అమెకు  బెయిల్ మంజూరు చేసింది.   లక్ష‌ రూపాయల పూచీకుత్తు తో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ  అవసరం అయినపుడు విచారణకు హాజరుకావాలని మందలించింది.

Similar News