మనం కల్తీ మద్యంతో జనాలు ప్రాణాలు పోతున్నాయని. అయినా మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. సంపాదించడం పీపాలు పీపాలు మందు తాగడం ఆతరువాత కల్తీ మద్యం వల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం ఓ పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కల్తీమద్యాన్ని కనిపెట్టేలా శాస్త్రవేత్తలు పరిశోదనలు జరుపుతున్నారు. ఈ పరిశోదనల ఫలితాల అనంతరం ఆ పరికరం అందుబాటులోకి రానుంది. ఇల్లినాయిస్ యూనివర్సిటీకి చెందిన కెన్నెత్ ఎస్ సస్ లిక్ ల వైద్యుల బృందం కల్తీ మద్యాన్ని ఈజీగా పసిగట్టేలా అడ్వాన్స్‌డ్ సెన్సార్స్ కలిగిన పరికరాన్ని రూపొందించడానికి వీరికి కేవలం 36 రోజులు పట్టినట్లు వారు చెప్పారు. ఈ పరికరాన్ని 14 రకాల మద్యంపై పరీక్షించగా.. కల్తీని స్పష్టంగా గుర్తించినట్లు సదరు శాస్త్రవేత్తలు తెలిపారు.