ఇప్పటి వరకు టాలీవుడ్‌లో పెళ్లికాకుండా బ్యాచిలర్‌గా ఉన్నవారిలో మొదటగా గుర్తుకొచ్చేది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కాగా బహుబలి టీమ్ కాఫీ విత్ కరణ్ షో పాల్గోన్న విషయం తెలిసిందే ఇందులో ప్రభాస్ పెళ్లి విషయం ప్రస్తావన లేవనేత్తాడు కరణ్. అగ్ర దర్శకుడు రాజమౌళి దగ్గర ప్రభాస్ పెళ్లి ఎప్పడు అని అడిగాడు కరణ్. దీనికి రాజమౌళి స్పందిస్తూ పెళ్లి విషయంలో ప్రభాస్ చాలా బద్దకస్తుడని, తనకి పెళ్లి చూపులు చూడటలు, శుభలేఖలు లాంటీ ఫర్మలిటిస్ నచ్చవని పెళ్లింటే రెండు మూడు రోజులు సమయం పడుతుందని అందుకే ప్రభాస్ పెళ్లి విషయంలో కాస్తా సమయం తీసుకుంటాడని రాజమౌళి చెప్పుకొచ్చారు. అయితే మరి ప్రభాస్ ఓ అమ్మయితో మూవ్ కావచ్చుకదా అని కరణ్ అడగ్గా ప్రభాస్ అలా చేసే వ్యక్తా కాదని కేవలం పెళ్లి విషయంలో మాత్రమే బద్దకమని పెర్కోన్నారు.