భారీ అంచనాలతో విడుదలైన అజ్ఞాతవాసి డిజాస్టర్ టాక్ వచ్చింది. పాత సీసాలో కొత్త సారా అన్న చందంగా పవన్ గతంలో అత్తారింటికి దారేది సినిమాని మక్కీకి మక్కీ కాపీ కొట్టినట్టు ఉందని అజ్ఞాతవాసిపై కామెంట్స్ వినిపించాయి. దీన్ని నుంచి ఉపశమనం పొందేలా అక్కడక్కడ కొన్ని సీన్లు యాడ్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నించినా..అసలే డిజాస్టర్ టాక్ తో నడుస్తుంది కాబట్టి మరోసారి సినిమా చూసేందుకు ప్రేక్షకులు సాహసం చేయడంలేదు. ఈ నేపథ్యంలో సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయనేదానిపై విశ్లేషిస్తే ఇక్కడ డిజాస్టర్ టాక్ తెచ్చుకొని వసూళ్లు మందగించాయి. ఇక ఓవర్సీస్ లో అజ్ఞాతవాసి వసూళ్లు కుమ్మేసినట్లు తెలుస్తోంది.
ఆదివారం దాకా పూర్తైన రన్ ని పరిగణనలోకి తీసుకుంటే రెండు మిలియన్ డాలర్ల మార్క్ ని విజయవంతగా పూర్తి చేసుకున్నాడు. పవన్ అల్ టైం హిట్ అత్తారింటికి దారేది ఫుల్ రన్ లో తెచ్చింది 1.89 మిలియన్ డాలర్లు మాత్రమే. త్రివిక్రమ్ లాస్ట్ మూవీ అఆ కూడా 2 మిలియన్ మార్క్ అందుకుంది. ప్రస్తుతానికి ఎనిమిదో స్థానంలో ఉన్న అజ్ఞాతవాసి మరో వారం లేదా పది రోజులు ఎంత చేస్తాడు అనే దాన్ని బట్టి ప్లేస్ డిసైడ్ అవుతుంది.