నేడు క్రిస్మస్ సందర్భంగా ప్రముఖ నటీ సమంత తన భర్త నాగచైతన్యతో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. తమ ఇంట్లో నిర్మించుకున్న క్రిస్మస్ ట్రీని చాలా చక్కగా అలంకరించిన సమంత, తన భర్త నాగచైతన్యతో ట్రీ పక్కన నిలుచోని ఫోటోలు దిగారు. ఈ ఫోటో తన ట్వీట్టర్‌లో తమ అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ నెట్ వర్క్‌లో వైరల్‌గా దూసుకెళ్తున్నాయి. సమంత ప్రస్తుతం శివనిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో సమంత నటీస్తోంది. కాగా ఈ సినిమాలో నాగాచైతన్య ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ రిమేక్ చిత్రం చేయనున్నట్లు సమాచారం.