ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేసిన 15వ ఆర్థిక సంఘం చైర్మెన్

Update: 2018-10-12 02:21 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో నిన్న(గురువారం) 15వ ఆర్థిక సంఘం చైర్మెన్ నందకిశోర్‌ సింగ్‌ భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడిన అయన.. ఏపీ పునర్విభజన చట్టం విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో విభజన చట్టాల అమలులో ప్రత్యేక వ్యవస్థ వుండేది. ఏపి పునర్విభజన చట్టం అమలుకు ప్రర్యవేక్షణ వ్యవస్థ అనేదే లేదు. గతంలో విభజన చట్టం అమలులో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బాధ్యులుగా ఉండేవారు. ఏపి పునర్విభజన చట్టం పార్లమెంట్ కు వచ్చినప్పుడు నేను రాజ్యసభలోనే ఉన్నాను. అప్పుడు ఏపీకి మద్దతుగా మాట్లాడానని ఆయన గుర్తుచేస్తూ.. కమిషన్‌ పరిధికి లోబడి మాత్రమే తాము పనిచేయవలసి ఉంటుందన్నారు. ప్రత్యేక హోదాను అమలుచేసే బాధ్యత ప్లానింగ్‌ కమిషన్‌ తీసుకుంటుందన్నారు. అలాగే, ఏపీ హోదాను 14వ ఆర్థిక సంఘం అడ్డుకుందని చెప్పడం అవాస్తవమన్నారు.

Similar News