ఆర్థిక సంస్కరణలకు పీవీ నరసింహారావు ఆద్యుడని నేతలు కొనియాడారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 14వ వర్ధంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న పీవీ జ్ఞానభూమికి తరలివెళ్లి ఆయన సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. పీవీ మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రగతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, టీఆర్‌ఎస్ నేతలు నాయిని, తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నేత పొన్నాల తదితరులు పాల్గొన్నారు.