CIBIL Score: సిబిల్‌ స్కోరు తక్కువగా ఉన్నప్పటికీ లోన్‌ పొందవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..!

CIBIL Score: మీ సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ బాగా లేకుంటే రుణం తీసుకోవడం చాలాకష్టం.

Update: 2023-02-27 08:43 GMT

CIBIL Score: సిబిల్‌ స్కోరు తక్కువగా ఉన్నప్పటికీ లోన్‌ పొందవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..!

CIBIL Score: మీ సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ బాగా లేకుంటే రుణం తీసుకోవడం చాలాకష్టం. అయితే మీరు చెడ్డ క్రెడిట్ స్కోర్‌తో కూడా సులభంగా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే రుణం పొందడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ తక్కువగా ఉన్నప్పుడే సమస్యలు మొదలవుతాయి. అయితే కొన్ని చిట్కాల ద్వారా చెడ్డ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ సులభంగా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. దాని గురించి తెలుసుకుందాం.

క్రెడిట్ స్కోర్ సాధారణంగా 300 నుంచి 900 వరకు ఉంటుంది. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే చాలా మంచిది. CIBIL స్కోర్ 550 నుంచి 750 మధ్య ఉంటే బాగానే ఉందని అర్థం. అయితే CIBIL స్కోర్ 550 కంటే తక్కువ ఉంటే తక్కువగా ఉందని పరిగణిస్తారు. అప్పుడు ప్రజలు బ్యాంకుల నుంచి ప్రైవేట్‌ సంస్థల నుంచి రుణాలు పొందలేరు. మీ దరఖాస్తులని అవి తిరస్కరిస్తాయి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

1. చెడ్డ క్రెడిట్ స్కోర్‌ ఉన్నప్పుడు గ్యారెంటర్ సహాయంతో లోన్ పొందవచ్చు. బ్యాంక్ అతని క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తుంది. గ్యారెంటర్‌ని కలిగి ఉండటం వల్ల మీరు రుణ చెల్లింపులని సకాలంలో చెల్లిస్తారని బ్యాంక్ నమ్ముతుంది.

2. చెడ్డ క్రెడిట్ స్కోర్‌ ఉన్నప్పుడు ఆస్తిని తనఖా పెట్టి పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ఇది హామీదారు వంటిది. ఇందులో గ్యారెంటర్‌ చేసే పని ఆస్తి చేస్తుంది. అయితే రుణం తిరిగి చెల్లించకపోతే బ్యాంకు తనఖా పెట్టిన ఆస్తిని విక్రయించే హక్కు ఉంటుందని గుర్తుంచుకోండి.

3. చెడ్డ క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండటం వల్ల లోన్ పొందడం కష్టమవుతుంది. అయితే, తక్కువ మొత్తంలో వ్యక్తిగత రుణం కోసం అడిగితే బ్యాంకులు మంజూరు చేసే అవకాశం ఉంటుంది.

4. కొన్నిసార్లు క్రెడిట్ నివేదికలో లోపాల వల్ల మీ క్రెడిట్ స్కోర్‌ దెబ్బతినవచ్చు. ఇది రుణం పొందే అవకాశాలను ప్రభావితం చేస్తుంది. కనీసం సంవత్సరానికి ఒకసారి మీ క్రెడిట్ నివేదికను ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకోండి. ఏదైనా పొరపాటు జరిగితే సదరు కంపెనీకి తెలియజేయండి. తర్వాత రుణం పొందడం తేలిక అవుతుంది.

Tags:    

Similar News