Second Hand Laptop: సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కొంటున్నారా.. ఇవి తెలియకుంటే మోసపోతారు జాగ్రత్త..!

Second Hand Laptop: ఈ రోజుల్లో దాదాపు అన్నిపనులు ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. అందుకే స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లకు డిమాండ్‌ పెరిగింది.

Update: 2024-02-11 03:30 GMT

Second Hand Laptop: సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కొంటున్నారా.. ఇవి తెలియకుంటే మోసపోతారు జాగ్రత్త..!

Second Hand Laptop: ఈ రోజుల్లో దాదాపు అన్నిపనులు ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. అందుకే స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లకు డిమాండ్‌ పెరిగింది. పట్టణాల నుంచి గ్రామాల వరకు వీటి వాడకం విపరీతంగా పెరిగింది. ఇక కరోనా టైంలో ఉద్యోగులందరూ ఇంటి నుంచే పనిచేశారు కాబట్టి అందరూ ల్యాప్‌టాప్‌లు తీసుకున్నారు. అయితే కొంతమందికి ల్యాప్‌టాప్‌ కొనడం బడ్జెట్‌తో కూడిన వ్యవహారం. అందుకే వారు సెకండ్‌ హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌లపై దృష్టి పెడుతారు. వీటిని కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

మీ అవసరాలు ఏంటి..?

సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కొనడానికి ముందు మీరు ల్యాప్‌టాప్‌ను దేనికి ఉపయోగించాలో నిర్ణయించుకోవాలి. ఇంటర్నెట్‌ని బ్రౌజ్ చేయడం, ఆఫీసు పని చేయడం లేదా కొద్దిగా గేమింగ్ ఆడడం వంటి సాధారణ పనులు చేయాలంటే పాత ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. కానీ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్ డిజైన్ లేదా గేమింగ్ వంటి పెద్ద పెద్ద పనులు చేయాలంటే కొత్త ల్యాప్‌టాప్ అవసరమవుతుందని గుర్తించండి.

ల్యాప్‌టాప్ ను చెక్‌ చేయండి

సెకండ్‌ హ్యాండ్‌ ల్యాప్‌టాప్ కొనేముందు దానిని క్షుణ్ణంగా చెక్‌ చేయాలి. ల్యాప్‌టాప్ బాడీలో ఏవైనా గీతలు లేదా పగుళ్లు ఉన్నాయా, స్క్రీన్‌పై ఏవైనా మరకలు లేదా లోపాలు ఉన్నాయా, కీబోర్డ్, మౌస్ ప్యాడ్ సరిగ్గా పని చేస్తున్నాయో, ల్యాప్‌టాప్ బ్యాటరీ బాగుందా తదితర విషయాలు జాగ్రత్తగా చెక్‌ చేయాలి.

ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్లు చెక్‌ చేయాలి

ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్‌లను కూడా చెక్‌ చేయాలి. ల్యాప్‌టాప్ ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, డిస్‌ప్లే వంటి అన్ని విషయాలను జాగ్రత్తగా చెక్‌ చేయాలి. వీటిలో ఏదైనా మీకు మరింత ముఖ్యమైనది అయితే దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు క్రాస్‌ చెక్‌ చేయాలి.

ల్యాప్‌టాప్ వారంటీని చెక్‌ చేయాలి

ల్యాప్‌టాప్‌కు వారంటీ ఉంటే అది మంచి ఒప్పందం. వారంటీ సమయంలో ల్యాప్‌టాప్‌లో ఏదైనా లోపం ఉంటే దాన్ని ఉచితంగా రిపేర్ చేసుకోవచ్చు.సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కొనుగోలు అనేది దాని ధర, స్పెసిఫికేషన్, వారంటీపై ఆధారపడి ఉంటుంది. ల్యాప్‌టాప్ ధరకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వొద్దు. కానీ ధర చాలా తక్కువగా ఉంటే ఆ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవద్దు.

Tags:    

Similar News