Business Ideas: ఎకరం భూమి ఉంటే.. ఏడాదికి రూ. 15లక్షలు వెనకేసుకోవచ్చు..ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు
Business Ideas: సంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. విటమిన్ ఏ పుష్కలంగా ఉండే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. బొప్పాయి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మార్కెట్లో ఈ పండుకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. మీరు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే..మీకు ఎకరం భూమి ఉంటే చాలు. ఎందుకంటే ఎకరం భూమిలో బొప్పాయిని సాగు చేస్తే ఏడాదికి రూ. 15లక్షల వరకు లాభం పొందవచ్చు. పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి బొప్పాయిని ఎలా సాగు చేయాలి..లాభం పొందాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నా ఏదొక వెలితి వారిలో కనిపిస్తుంది. ముఖ్యంగా నేటికాలంలో పెరిగిన ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయం లేకపోవడం చాలా మంది ఆర్థికకష్టాలను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం చేస్తూ..ఇతర వ్యాపారాలను కూడా ప్రారంభిస్తున్నారు. మీరు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే మీకోసం ఒక అదిరిపోయే బిజినెస్ ఐడియాను చెబుతాం. ఈ వ్యాపారం ద్వారా లక్షల ఆదాయం పొందవచ్చు. ఉద్యోగం చేస్తూ కూడా ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు.
బొప్పాయి పండుకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఈ పండులో ఉన్న పోషకాలు అలాంటివి. ముఖ్యంగా విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. డెంగ్యూ బాధితులకు ఈ పండు ఒక వరం అని చెప్పవచ్చు. బొప్పాయిలో చాలా రకాలు ఉన్నాయి. దేశీయ రకాలతోపాటు విదేశీ రకాలు కూడా చాలా ఉన్నాయి. బొప్పాయిని సాగు చేసే ముందుకు ఈ రకాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
పూసా నన్హా: ఈ రకం 1983 సంవత్సరంలో అభివృద్ధి చేశారు. 25 నుంచి 30 కిలోల వరకు ఒక పండు ఉంటుంది. ఈ పండ్లు చిన్నగా, మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి.మొక్కల ఎత్తు సుమారు 120 సెంటీమీటర్లు. ఈ మొక్కల ఎత్తు భూమి ఉపరితలం నుండి 30 సెం.మీ ఎత్తు వరకు పెరుగుతుంటాయి
పూసా జెయింట్: ఇది 1981 సంవత్సరంలో అభివృద్ధి చేశారు. దీని పండ్లు పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఇది కూరగాయలు, పేటల తయారీకి అనువైన రకం. ఒక మొక్క 30-35 కిలోల పండ్లను ఉత్పత్తి చేస్తుంది. 92 సెంటిమీటర్లు పెరిగినప్పుడు పండ్లు కాస్తాయి.
పూసా రుచికరమైన: ఇది 1986 సంవత్సరంలో అభివృద్ధి చేయగా..ఒక్క మొక్క 40 నుండి 45 కిలోల బొప్పాయిని ఉత్పత్తి చేస్తుంది. ఈ మొక్కల ఎత్తు 216 సెంటీమీటర్లు. మొక్కల ఎత్తు 80 సెం.మీ ఉన్నప్పుడు, మొక్కలు ఫలాలు వస్తుంటాయి.
సూర్య: హైబ్రిడ్ రకాల్లో ఇది ప్రధానమైనది. ఒక పండు బరువు 500 నుండి 700 గ్రాములు ఉంటుంది. పండ్ల నిల్వ సామర్థ్యం బాగుంది. ఒక మొక్కకు పండ్ల దిగుబడి 55-56 కిలోలు.
రెడ్ లేడీ 786: ఇది హైబ్రిడ్ రకాల్లో ఒకటి. ఈ రకం పండు ప్రత్యేకత ఏమిటంటే, ఒకే మొక్కలో మగ, ఆడ పువ్వులు పెరుగుతాయి. దీని కారణంగా, ప్రతి మొక్క నుండి పండ్లు లభిస్తాయి. మొక్కలు నాటిన 9 నెలల తర్వాత పండ్లు కాస్తాయి. ఇతర రకాలతో పోల్చి చూస్తే ఈ రకం పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ జాతి మొక్కలు భారతదేశం అంతటా సాగు అవుతున్నాయి.
ఇక బొప్పాయి తోటల పెంపకానికి 1 లేదా2 ఎకరాలు భూమి అవసరం. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటవచ్చు. దాదాపు 6,500 పెట్టుబడి అవసరం అవుతుంది. ప్రతి ఏడాది ఈ పంటను సాగు చేయడం ద్వారా ఎకరాలకు రూ. 12 నుంచి 15లక్షల వరకు ఆదాయం వస్తుంది. సీజన్ లో అయితే మరింత ఆదాయాన్ని పొందవచ్చు. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకోండి.