Gold And Silver Rate Today: పసిడి ప్రియులకు భారీ శుభవార్త..భారీగా తగ్గిన వెండి..స్వల్పంగా తగ్గిన బంగారం
Gold And Silver Rate Today: దేశంలో బంగారం ధరలు మరోసారి తగ్గు ముఖం పట్టాయి. గురువారం స్వల్పంగా పెరిగిన పసిడి ధర...శుక్రవారం తగ్గింది. గత కొన్నాళ్లుగా భారీగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర పసిడి ప్రియులు కొనేగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వెండి ధర మాత్రం భారీగా పెరుగుతూనే ఉంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం, ధరలు మరోసారి తగ్గుతున్నాయి. ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, స్టాకిస్టులు, రిటైలర్లు భారీగా విక్రయించడంతో వెండి ధరలు శుక్రవారం రూ.4,900 తగ్గింది. దీంతో కిలో రూ.90,900 వద్ద మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అదే సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.78,700కి చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ.78,300కి చేరుకుంది. గురువారం నాడు 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ.78,800, రూ.78,700 వద్ద ముగిశాయి.
నగల వ్యాపారులు, నాణేల తయారీదారుల నుండి డిమాండ్ బలహీనంగా ఉండటంతో వెండి కూడా కిలోకు రూ.4,900 తగ్గి రూ.90,900కి చేరుకుంది. అంతకుముందు నవంబర్ 4న వెండి ధర రూ.4,600 తగ్గింది.గురువారం దేశ రాజధానిలో రెండు వారాల విరామం తర్వాత వెండి భారీగా పెరిగింది. రూ. 5,200, పెరగడంతో కిలో రూ. 95,000కి చేరుకుంది. అయితే శుక్రవారం మరోసారి తగ్గింది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్లాన్‌ల కారణంగా ప్రపంచ అనిశ్చితి పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. ఇటీవలి US ఆర్థిక డేటా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశం తగ్గించింది. దీంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండి పట్ల ఉదాసీనంగా ఉన్నారు. LKP సెక్యూరిటీస్‌లో కమోడిటీ అండ్ కరెన్సీ VP రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ.. బంగారం ధరలు చాలా అస్థిరతను చవిచూశాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య మొదట్లో బలహీనంగా ఉన్నప్పటికీ త్వరగా కోలుకుంది. తర్వాత బంగారన్ని సురక్షితమైన పెట్టుబడిని ప్రోత్సహించింది. డాలర్ ఇండెక్స్ కదలికలు, భౌగోళిక రాజకీయ వాతావరణాన్ని బట్టి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతాయని త్రివేది చెప్పారు.