Gold And Sliver Rates : పెరిగిన బంగారం, వెండి ధరలు..భారీగా పెరిగిన వెండి..ఎంతంటే?
Gold And Sliver Rates : దేశంలో బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. మూడు రోజుల పాటు భారీగా తగ్గిన బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. అటు వెండి ధర భారీగా పెరిగింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరుగుదల కనిపించింది. దేశంలో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో ఇప్పుడు చూద్దాం.
దేశీయంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 650 పెరిగింది. రూ. 78,800కు చేరుకుంది. కిలో వెండి ధర ఏకంగా 5,200 పెరిగింది. దీంతో 95,800కు చేరుకుంది. వెండి ఒక్కరోజులో ఇంత పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం 1. 02 శాతం పెరిగి 2,673 డాలర్లకు చేరుకుంది. వెండి కూడా 30.94 డాలర్లకు ఎగబాకింది.
అయితే బంగారం ధరలు భారీగా తగ్గుతాయని భావించిన పసిడి ప్రియులకు నేటి ధరలు మరోసారి అయోమయంలో పడేశాయి. అసలు బంగారం ధర తగ్గుతుందా అనే ఆలోచన మళ్లీ మొదలైంది. నాలుగు రోజులుగా తగ్గుతున్న ధరలు చూస్తుంటే బంగారం ధర 10 గ్రాములు 60వేలకు పడిపోతుందని భావించారు. కానీ అది మూణ్నాళ్ల ముచ్చట వలే మారింది. ఎందుకంటే అంతర్జాతీయ నెలకొంటున్న పరిస్థితులు బంగారం ధరలను భారీగా పెంచుతున్నాయని కానీ తగ్గించడం లేదు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత తగ్గిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మళ్లీ తగ్గాయి..ఇప్పుడు మళ్లీ పెరిగాయి. ఇలా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గుదల అనేది పసిడి ప్రియులను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. భవిష్యత్తులో బంగారం ధర తగ్గే అవకాశం లేదని చెప్పవచ్చని పలువురు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితులను పరిశీలిస్తే బంగారంలో పెట్టుబడి సేఫ్ భావిస్తున్నారు కాబట్టి బంగారం ధరలు ఇంకా పెరుగుతాయనే చెబుతున్నారు.