IT Employees: మరో 5ఏళ్లలో 10లక్షల ఉద్యోగాలు..ఐటీలో ఊపందుకున్న నియామకాలు..హైదరాబాదీలకే ఫుల్ డిమాండ్
IT Employees: ఐటీ రంగం మళ్లీ పుంజుకుంటోంది. ఆయా కంపెనీలు మంచి ఫలితాలు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ నిపుణులకు మళ్లీ డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే రానున్న ఆరు నెలల్లోనే ఐటీ సేవల విభాగంలో నియామకాలు 10 నుంచి 12శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు క్వెస్ కార్ప్ రిపోర్టు వెల్లడించింది. దీంట్లో హైదరాబాదీలకే ఫుల్ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక్కప్పటితో పోల్చితే ఐటీకి డిమాండ్ మళ్లీ పెరుగుతోంది. రానున్న ఆరు నెలల కాలంలో ఐటీ సేవల విభాగంలో నియామకాలు 10 నుంచి 12 శాతం మేర పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది క్వెస్ కార్ప్. ఓ నివేదికను కూడా వెల్లడించింది. కొత్త సాంకేతికతల రాకతో ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థల స్వరూపం మారుతుండటం దీనికి కారణమని పేర్కొంది. ఇంకా జనరేటివ్ ఏఈ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీలు 20230 కల్లా 10 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తాయని వివరించింది. ఏప్రిల్, జూన్ త్రైమాసికంతో పోల్చితే జులై, సెప్టెంబర్ క్వార్టర్ లో ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ సైబర్ సెక్యూరిటీ రంగంలో నిపుణులకు డిమాండ్ వరుసగా 71శాతం, 58శాతం పెరిగినట్లు రిపోర్టులో వెల్లడైంది.
2024-25 ఆర్థిక ఏడాది మొదటి రెండు త్రైమాసికంలో నిపుణులకు డిమాండ్ తీరుతెన్నుల గురించి స్పష్టమైన అవగాహన అందించేందుకు క్వెస్ కార్ప్ చేసిన విశ్లేషణ ఆధారంగానే ఈ రిపోర్టును రూపొందించారు.
ఈఆర్ పి డెవలప్ మెంట్ టెస్టింగ్ డేటా సైన్స్, నెట్ వర్కింగ్ వంటి అగ్రగామి నైపుణ్యాల విభాగంలో నిపుణులకు సగటున డిమాండ్ 79శాతం పెరిగింది సైబర్ సెక్యూరిటీ 20శాతం జావా 30శతం, డెవ్ ఆప్స్ 25శాతం గిరాకీ పెరిగింది. సాంకేతిక నిపుణులకు డిమాండ్ విషయంలో ఐటీ సర్వీసు సంస్థలే 37శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో వరుసగా హైటెక్,కన్సల్టింగ్, బ్యాంకింగ్, బీమా ఆర్థిక సేవలు సంస్థల వాటా 8శాతంగా ఉంది. ఇండియాలో నిపుణుల నియామకాలకు జీసీసీలే ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. ఏఐ, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డెవ్ యాప్స్, అనలిటికల్స్ వంటి సాంకేతిక నైపుణ్యాలు అవసరం ఉన్న ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఉంది. టైర్ 2, టైర్ 3 నగరాల్లో కూడా ఈమధ్య కాలంలో విపరీతంగా పెరుగుతుందని రిపోర్టులో పేర్కొంది.