Silver Prices: ఇప్పుడు వెండి కొంటే..భవిష్యత్తులో బంగారం అవుతుంది..వెండికి అంత డిమాండ్ ఎందుకు పెరుగుతుందంటే?

Update: 2024-11-28 04:44 GMT

silver prices: సాధారణంగా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. కానీ వెండికి ఆమాత్రం ఉండదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యోలా కనిపిస్తోంది. బంగారం ధర తగ్గుతుంటే..వెండి ధర మాత్రం తగ్గేదేలే అంటోంది. గురువారం ఒక్కరోజు కిలో వెండి ధర రూ. 5,200 పెరగడంతో బంగారం కంటే వెండి డిమాండ్ పెరిగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా వెండి ధర ఒక్కరోజులోనే ఇంత పెరగడం ఇదే తొలిసారి. అయితే ఇప్పుడు వెండిని కొనుగోలు చేసి పెట్టుకుంటే భవిష్యత్తులో బంగారం కంటే విలువైంది మారుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అసలు వెండికి అంత డిమాండ్ ఎందుకు పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం దేశంలో వెండి ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. అయితే వెండి ధరను ప్రభావితం చేసే అవకాలేంటి.దేశంలో చాలా బంగారానికి విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ వెండికి కూడా అంతే ప్రాముఖ్యత ఎందుకు ఏర్పడింది. ప్రస్తుతం వెండి ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దానికి కారణాలపై చాలా మందిలో అయోమయం నెలకొంది.

వెండిని బంగారం లాంటి సురక్షితమైన పెట్టుబడిగానే చూస్తుంటారు. ధర పెరగడానికి కూడా ఇదొక కారణమని చెప్పవచ్చు. ఆర్థిక అనిశ్చితి లేదా మార్కెట్ అస్థిరత సూచనలు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు తరచుగా వెండి వంటి విలువైన లోహాలపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కోవిడ్,భౌగోలిక రాజకీయ వైరుధ్యాలు వెండితోపాటు సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ ను భారీగా పెంచాయి. దీంతో పెట్టుబడిదారులు వెండిపై డబ్బును పెట్టుబడి పెడతారని చెప్పుతున్నారు మార్కెట్ నిపుణులు. అందుకే వెండి ధర భారీగా పెరగడానికి కారణమని అంటున్నారు.

భవిష్యత్తులో వెండి ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. రానున్న కాలంలో వెండికి డిమాండ్ భారీగా పెరుగుతుందని అంటున్నారు. బంగారం, వెండి నిల్వలు క్రమంగా తగ్గడం ఒక్క సంవత్సరంలోనే వెండి ధర 46శాతం పెరగడం కూడా దీనికి నిదర్శనమే అంటున్నారు. ఈమధ్య కిలో వెండి ధర ఏకంగా రూ. లక్ష దాటవేసిన విషయం తెలిసిందే. బ్యాంకులు వడ్డీ రేట్లతో ఎలాంటి సంబంధం లేకుండా భవిష్యత్తులో వెండి ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని సిల్వర్ ఇన్ స్టిట్యూట్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

వెండి ధరలు పెరగడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వెండికి, ఏఐకి మధ్య గల సంబంధం ఏంటన్న సందేహంచాలా మందిలో కలుగుతుంది. ఏఐలో వాడే చిప్స్ తయారీలో వెండి కీలకంగా మారనుంది. దీంతో రానున్నరోజుల్లో ఏఐ మరింత విస్తరించే అవకాశం ఉంది. దీంతో వెండికి భారీగా డిమాండ్ ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు సౌర విద్యుత్లో కూడా వెండిని ఉపయోగిస్తున్నారు. సోలార్ సెల్స్ నుంచి విద్యుత్ ప్రవహించేందుకు సిల్వర్ వాహకంగా పనిచేస్తుంది. ప్రస్తుతం దేశంలో సౌర విద్యుత్ పరిశ్రమ క్రమంగా పెరుగుతున్న తరుణంలో వెండికి డిమాండ్ భారీగా పెరగడం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి.ఇవే కాదు చెప్పుకుంటూ పోతే వెండి పెరిగేందుకు కారణాలెన్నో ఉన్నాయి.

Tags:    

Similar News