స్వల్పంగా పెరిగిన పెట్రోల్..స్థిరంగా డీజిల్ ధరలు!
పెట్రోల్ ధరలు ఈరోజు (30-11-2019) స్వల్పంగా పెరిగాయి. అటు డీజిలు ధరలు ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి.
మళ్ళీ పెట్రోల్ ధరలు ఈరోజు (30-11-2019) స్వల్పంగా పెరిగాయి. మరో వైపు డీజిలు ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో నిన్నటి ధరలతో పోలిస్తే లీటరు పెట్రోల్ ధర 5 పైసలు పెరిగింది. దీంతో 79.66 రూపాయలకు చేరింది. ఇక డీజిలు ధర మార్పులు లేకుండా 71.79 రూపాయల వద్ద నిలిచింది.
విజయవాడలో పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి 78.85 రూపాయలు గానూ, డీజిలు ధర మార్పులేకుండా 70.75 రూపాయలుగానూ ఉన్నాయి. అమరావతి లోనూ పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి 79.22 రూపాయల వద్దకు చేరింది. డీజిలు ధర మార్పులేకుండా 70.౦౯ రూపాయల వద్ద స్థిరంగా ఉంది.
ఇక ఢిల్లీలోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. డీజిలు ధరల్లో మాత్రం మార్పు లేదు. ఇక్కడ పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి 74.86 రూపాయలకు చేరుకోగా, డీజిలు ధర మార్పులేకుండా 65.78 రూపాయలుగా స్థిరంగా ఉంది. అటు వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలు లీటరుకు 5పైసలు పెరిగి 80.51 రూపాయలు గానూ, డీజిలు ధర మార్పులేకుండా 69.00 రూపాయలుగానూ ఉన్నాయి.