GST Collection : 2024లో జీఎస్టీతో రికార్డు బద్దలు కొట్టిన కేంద్రం.. డిసెంబర్లో ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసిందంటే ?
GST Collection : 2024 భారత ఆర్థిక వ్యవస్థకు మంచి కాలమని చెప్పుకోవచ్చు. జనవరి నుండి డిసెంబర్ వరకు నెలల్లో జీఎస్టీ వసూళ్లు ద్వారా ప్రభుత్వానికి మొత్తం 21 లక్షల 51 వేల కోట్ల రూపాయలు వచ్చాయి. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో జీఎస్‌టీ వల్ల ప్రభుత్వానికి కాస్త తక్కువ ఆదాయం వచ్చింది. నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు. డిసెంబర్‌లో రూ.1.77 లక్షల కోట్లకు తగ్గింది. నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 8.5 శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఏప్రిల్-డిసెంబర్ కాలానికి వసూళ్లు రూ.16.34 లక్షల కోట్లు. అక్టోబర్‌లో స్థూల జీఎస్టీ సేకరణ 9 శాతం పెరిగి రూ. 1.87 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీయ అమ్మకాల కారణంగా ఇప్పటి వరకు ఇది రెండవ అత్యధిక సేకరణ.
2024లో జీఎస్టీ నుంచి ఇంత ఎక్కువ వసూళ్లు
2024 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూళ్ల గణాంకాలను పరిశీలిస్తే, అందులో చాలా హెచ్చుతగ్గులు కనిపించాయి. జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ ద్వారా ప్రభుత్వ ఖజానాలోకి రూ.21 లక్షల 51 వేల కోట్లు వచ్చాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.16.33 లక్షల కోట్లు. ఈ డేటా ఏప్రిల్ 2024 నుండి డిసెంబర్ 2024 వరకు ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలలు మిగిలి ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిఎస్‌టి వసూళ్లు ద్వారా ప్రభుత్వానికి రూ. 20.14 లక్షల కోట్లు అందాయని, అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిఎస్‌టి ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 14.96 లక్షల కోట్లు వచ్చింది.
జనవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో రూ. 1.68 లక్షల కోట్లు, మార్చిలో రూ. 1.78 లక్షల కోట్లు, ఏప్రిల్ లో రూ. 2.1 లక్షల కోట్లు, మేలో రూ. 1.73 లక్షల కోట్లు, జూన్ లో రూ. 1.74 లక్షల కోట్లు, జూలైలో రూ. 1.82 లక్షల కోట్లు, ఆగస్టులో రూ. 1.75 లక్షల కోట్లు, సెప్టెంబర్ రూ. 1.73 లక్షల కోట్లు, అక్టోబర్ రూ. 1.87 లక్షల కోట్లు, నవంబర్ లో 1.82లక్షల కోట్లు, డిసెంబర్ లో 1.77లక్షల కోట్లు వసూలయ్యాయి.
జనవరి 2024 నుండి డిసెంబర్ 2024 వరకు ప్రతి నెల జీఎస్టీ వసూళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. ప్రభుత్వం జీఎస్టీ వసూళ్లు రూ. 1.80 లక్షల కోట్లు దాటిన సందర్భాలు మూడు మాత్రమే ఉన్నాయి. జూలై 2024, అక్టోబర్ 2024, నవంబర్ 2024లో 1.80 లక్షల కోట్ల రూపాయలను దాటాయి.
జీఎస్టీ ఎగవేతను అరికట్టవచ్చు
జీఎస్టీ ఎగవేతను నిరోధించడానికి వస్తువుల కోసం ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజంను అమలు చేయడానికి జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో ఒక ప్రతిపాదన చేసింది. దీని కింద, అటువంటి వస్తువులు లేదా ప్యాకెట్లపై నిర్దిష్ట గుర్తు ఉంచబడుతుంది, తద్వారా అవి సరఫరా గొలుసులో గుర్తించబడతాయి. పన్ను ఎగవేతకు గురయ్యే ఉత్పత్తులను ట్రాక్ చేయడానికి , ట్రేస్ చేయడానికి ప్రభుత్వం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి, 2017 కేంద్ర వస్తువులు సేవల పన్ను (CGST) చట్టంలో సెక్షన్ 148A ద్వారా ఒక నిబంధనను చేర్చింది.