EPFO: పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..ఇక నుంచి మరిన్ని ప్రయోజనాలు
EPFO: పెన్షన్ దారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే సెంట్రలైజేడ్ పెన్షన్ పేమెంట్ సిస్టం అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.
EPFO: ఉద్యోగుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ స్కీం లేదా పిఎఫ్ స్కీం లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సర్వీస్ తర్వాత పింఛన్ కూడా ఇస్తున్నారు. తాజాగా ఈ పెన్షన్స్ విషయంలో మరో శుభవార్త చెప్పింది కేంద్రంలోని మోడీ సర్కార్. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం కింద పెన్షన్ జారీ చేస్తుంది ఈపీఎఫ్ఓ. అయితే ఈ స్కీం లో కొత్త ఏడాది కొన్ని మార్పులు తీసుకురానున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. పెన్షన్ పేమెంట్ సిస్టం అమల్లోకి తీసుకు వస్తున్నట్లు తెలిపింది.
సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టం తీసుకువచ్చేందుకు ఈపిఓ ఆమోదం లభించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అయిన మన్ సుఖ్ మాండవియా తెలిపారు. దీంతో ఇక దేశంలో ఎక్కడి నుంచి అయినా, ఏ బ్యాంకులో నుంచి అయినా, ఏ ప్రాంతం నుంచి అయినా పెన్షన్ తీసుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు.
తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 7 లక్షల మంది పెన్షన్ ధరలకు మరింత ప్రయోజనం కలుగుతుంది. ఈపీఎఫ్ ఆధునికరణలో సెంట్రల్ పేమెంట్ సిస్టం చాలా కీలకమైంది. తద్వారా ఎన్నో ఏళ్లుగా ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ నెరవేరబోతుందని ఆర్థిక శాఖ మంత్రి మాడవీయ తెలిపారు.
కాగా ప్రస్తుతం ఈపీఎఫ్ఓ జోనల్ లేదా ప్రాంతీయ కార్యాలయలో కేవలం మూడు నాలుగు బ్యాంకులో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి. పెన్షన్ స్టార్ట్ అయిన తర్వాత దృవీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తాజా మార్పులతో ఇకపై అలాంటి అవసరాలు ఉండవు. సెంట్రల్ పేమెంట్ సిస్టం అమల్లోకి వచ్చినట్లయితే బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే పెన్షన్ విడుదలైన వెంటనే ఆ మొత్తం నేరుగా ఆ బ్యాంకు ఖాతాలోకి జమవుతుంది.
ఉద్యోగులకు ఈపీఎఫ్ అనేది ఒక సేవింగ్స్ మాదిరిగా పనిచేస్తుంది. ఈపీఎఫ్ లో ఉద్యోగి కంపెనీ ప్రతినెలా చేసే కాంట్రిబ్యూషన్స్ మెసేజ్ వస్తుంది. ఉద్యోగులు తమ బేసిక్స్ శాలరీ, డియర్ నెస్ లో 12% చేయాల్సిన అవసరం ఉంటుంది. కంపెనీ కూడా అదే 12% చేయాల్సి ఉంటుంది. అందులో 8.33% ఎంప్లాయిస్ పెన్షన్స్ అకౌంట్ లోకి డిపాజిట్ చేస్తుంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25% గా ఉంది