Rule Change: నేటి నుంచి మారే రూల్స్ ఇవే.. ఇవి మీ జేబుపై ఎంత ప్రభావం చూపుతాయో తెలుసా ?
Rule Change: 2024 సంవత్సరం ముగిసింది. కొత్త సంవత్సరం రాకతో చాలా ముఖ్యమైన రూల్స్ మారిపోయాయి.
Rule Change: 2024 సంవత్సరం ముగిసింది. కొత్త సంవత్సరం రాకతో చాలా ముఖ్యమైన రూల్స్ మారిపోయాయి. ఇవి నేరుగా మీ జేబుపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఈ మార్పులు జనవరి 1 నుండి అమలులోకి రానున్నాయి. కాబట్టి ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో.. అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకుందాం. జనవరి 1న సంవత్సరం మారడమే కాదు ఎన్నో పెద్ద పెద్ద నిబంధనలు మారిపోయాయి. ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త ఖర్చులు కూడా ఉండనున్నాయి. కొత్త సంవత్సరం రాకతో చాలా ముఖ్యమైన నియమాలు మారాయి. ఈ మార్పులు జనవరి 1 నుండి అమలులోకి రానున్నాయి.
ఆర్బీఐ ఎఫ్ డీ నియామాల్లో మార్పులు
రిజర్వ్ బ్యాంక్ జనవరి 1 నుండి NBFC (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ), HFC (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ) ఫిక్స్‌డ్ డిపాజిట్లకు (FD) సంబంధించిన నిబంధనలను మార్చింది. ఇందులో డిపాజిట్లు తీసుకోవడానికి సంబంధించిన నియమాలు, లిక్విడ్ అసెట్స్‌ను ఉంచే శాతం, డిపాజిట్ల బీమాకు సంబంధించి కొత్తగా కొన్ని నియమాలు వచ్చాయి. ఎఫ్ డీలో పెట్టుబడి పెడితే, జనవరి 1 నుండి మెచ్యూరిటీకి ముందు అందులో డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఉపసంహరించుకునే నియమాలలో మార్పులు ఉంటాయి.
పెరగనున్న కార్ల ధరలు
కొత్త సంవత్సరం సందర్భంగా పలు కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. వీటిలో మారుతీ సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి కార్ల ధరలు పెరగనున్నాయి. ఈ కంపెనీలు దాదాపు 3శాతం మేరకు ధరను పెంచాలని నిర్ణయించాయి.
ఎల్ పీజీ ధర
చమురు కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన ఎల్‌పిజి ధరలను సమీక్షిస్తాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర గత కొన్ని నెలలుగా పెరిగింది. నేడు ఈ సిలిండర్ ధర తగ్గింది. అయితే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ఇప్పటికీ రూ.803కి అందుబాటులో ఉంది. డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
అమెజాన్ ప్రైమ్‌లో మార్పులు
అమెజాన్ ఇండియా తన ప్రైమ్ మెంబర్‌షిప్ నియమాలను జనవరి 1, 2025 నుండి మార్చింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోను ఒక ఖాతా నుండి రెండు టీవీలలో మాత్రమే ప్రసారం చేయవచ్చు. ఇంతకు ముందు ఐదు పరికరాల వరకు స్ట్రీమింగ్ అనుమతించబడింది. మరిన్ని టీవీలలో ప్రసారం చేయడానికి అదనపు సభ్యత్వం అవసరం.
జీఎస్టీ పోర్టల్‌లో మార్పులు
జనవరి 1 నుంచి జీఎస్టీ పోర్టల్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేస్తున్నారు. ఇ-వే బిల్లు గడువు, జీఎస్టీ పోర్టల్ భద్రతకు సంబంధించిన మార్పులు ఉంటాయి. కొత్త నిబంధనల అమలు కారణంగా కొనుగోలుదారులు, విక్రేతలు, రవాణాదారులు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
పెన్షన్ డబ్బు
ఈపీఎఫ్‌వో జనవరి 1 నుంచి పెన్షన్ నిబంధనలను సులభతరం చేసింది. ఇప్పుడు ఉద్యోగులు తమ పెన్షన్ మొత్తాన్ని ఏదైనా బ్యాంకు నుండి విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి అదనపు ధృవీకరణ అవసరం లేదు.