భగ్గుమన్న పెట్రోల్..డీజిల్ ధరలు!
పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు (09-12-2019) పైపైకి కదిలాయి.
పెట్రోల్ ధరలు ఈరోజు భగ్గుమన్నాయి. పెట్రోల్ ధరలు ఈరోజు (09-12-2019) బాగా పెరిగాయి. మరో వైపు డీజిలు ధరలు కూడా అదేవిధంగా పరుగులు తీశాయి. హైదరాబాద్ లో నిన్నటి ధరలతో పోలిస్తే లీటరు పెట్రోల్ ధర 15 పైసలు పెరిగింది. దీంతో 79.౮౧ రూపాయలకు చేరుకుంది. ఇక డీజిలు ధర లీటరుకు ఏకంగా 22 పైసలు పెరిగింది. 72.07 రూపాయల వద్దకు ఎగబాకింది.
విజయవాడలో పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి 79.00 రూపాయలు గానూ, డీజిలు ధర 21పైసలు పెరిగి 71.02 రూపాయలైంది. అమరావతి లోనూ పెట్రోల్ ధర 14 పైసలు పెరిగి 79.36 రూపా యలుగానూ, డీజిలు ధర కూడా21 పైసల పెరుగుదలతో 71.15 రూపాయల వద్దకు చేరుకుంది.
ఇక ఢిల్లీలోనూ పెట్రోల్ ధరలు పెరుగుదల నమోదు చేశాయి. డీజిలు ధర కూడా పైకెగసింది. ఇక్కడ పెట్రోల్ 14 పైసలు పెరిగి 75.00 రూపాయల వద్ద, డీజిలు ధర 20 రూపాయలు పెరిగి 66.04 రూపాయలకు చేరుకుంది. అటు వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ 14 పైసలు పెరిగి 80.65 రూపాయలు గానూ, డీజిలు ధర 21 పైసలు పెరిగి 69.27రూపాయలుగానూ ఉన్నాయి.