New ITR Forms: ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటీఆర్‌ ఫారమ్‌లు.. కచ్చితంగా ఈ నియమాలని గుర్తుంచుకోండి..!

New ITR Forms: మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే ముందు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి.

Update: 2023-03-24 07:30 GMT

New ITR Forms: ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటీఆర్‌ ఫారమ్‌లు.. కచ్చితంగా ఈ నియమాలని గుర్తుంచుకోండి..!

New ITR Forms: మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే ముందు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి. లేదంటే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. కొత్త ITR ఫారమ్‌లు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులో ఉంటాయి. అంటే మీరు జూలై 31, 2023లోపు ITR ఫైల్ చేయడం చాలా ముఖ్యం. గడువుతేదీ దాటిందంటే ఫైల్ చేసినందుకు జరిమానాగా రూ.5,000 చెల్లించాల్సి రావొచ్చు.

గతంలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వారు గడువులోపు తమ ఐటీఆర్‌ను సమర్పించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు రూ.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులని పన్ను చెల్లింపు నుంచి మినహాయించారు. వివిధ కారణాల వల్ల ఐటీఆర్ రిపోర్టింగ్ గడువును ప్రభుత్వం గతేడాది జూలై 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అయితే ఈ ఏడాది పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

పెనాల్టీ చెల్లించాలి

గడువు తేదీ తర్వాత ఐటీఆర్‌ ఫైల్ చేయడానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F కింద రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాలి. సెక్షన్ 234A కింద ప్రతి నెలా 1% చొప్పున లేదా బకాయి ఉన్న పన్ను బ్యాలెన్స్‌పై నెలలో కొంత భాగానికి వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. మీరు స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు, రియల్ ఎస్టేట్ లేదా వెంచర్‌లలో పెట్టుబడులపై నష్టాలను చవిచూస్తే వాటిని ముందుకు తీసుకెళ్లి వచ్చే ఏడాది నష్టాన్ని చూపించి ట్యాక్స్‌ ఆదా చేయవచ్చు. అయితే ITRలో నష్ట ప్రకటనను చేర్చి గడువు తేదీలోపు ఆదాయపు పన్ను శాఖకు సమర్పించినట్లయితే మాత్రమే నష్టాన్ని సర్దుబాటు చేయడం జరుగుతుందని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News