Business Idea: ఖాళీ బీర్ బాటిల్స్‌తో అద్భుతం.. ఆలోచన ఉండాలే కానీ భారీ ఆదాయం
అయితే వ్యాపారం అనగానే లక్షల్లో పెట్టుబడి, లాభాలు వస్తాయో రావో అనే ఆలోచనతో వెనకాముందు అవుతుంటారు. కానీ వినూత్నంగా ఆలోచిస్తే మాత్రం భారీగా లాభాలు ఆర్జించవచ్చు.
వ్యాపారం చేయాలి.. మంచి ఆదాయం ఆర్జించాలి. మనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించాలి. మనలో చాలా మందికి ఉండే కోరిక ఇది. అందుకే చాలా మంది ఏదో ఒక రోజు వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో ఉంటారు. ఆ దిశగా అడుగులు వేస్తుంటారు. ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచే వ్యాపారం గురించి ఆలోచించే వారు ఎంతో మంది ఉంటారు.
అయితే వ్యాపారం అనగానే లక్షల్లో పెట్టుబడి, లాభాలు వస్తాయో రావో అనే ఆలోచనతో వెనకాముందు అవుతుంటారు. కానీ వినూత్నంగా ఆలోచిస్తే మాత్రం భారీగా లాభాలు ఆర్జించవచ్చు. మంచి ఆలోచనే ఉండాలి కానీ.. ఎందుకు పనికిరావనుకునే బాటిల్స్‌తో కూడా అద్భుతం సృష్టించవచ్చు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీ బీర్ బాటిల్స్‌తో ప్రారంభించే ఈ వ్యాపారంతో భారీగా లాభాలు ఆర్జించవచ్చు. బీర్ బాటిల్స్‌ను క్రిస్టల్స్‌గా మార్చి విక్రయిస్తే లాభాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ క్రిస్టల్స్‌ను కొన్ని కంపెనీలు.. గాజు పాత్రలు, సీసలు, గ్లాసులను తయారు చేయడంలో ఉపయోగిస్తాయి. అలాగే కొన్ని నిర్మాణ సంస్థలు సైతం బీర్ బాటిల్స్ నుంచి తయారు చేసే క్రిస్టల్స్‌ను ఉపయోగిస్తుంటారు. కాబట్టి వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
ఈ బిజినెస్‌ను మొదలుపెట్టాలనుకుంటే ముందుగా గ్లాస్ బాటిల్ పౌడరింగ్ మిషన్‌ను కొనుగోలు చేయాలి. ఈ మిషిన్ ధర రూ. 50 వేల నుంచి రూ. రెండున్నర లక్షల వరకు ఉంటుంది. స్క్రాప్ పాయింట్స్ లేదా నేరుగా వైన్స్ లేదా బార్ల నుంచి బీర్ బాటిల్స్‌ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సేకరించిన బాటిల్స్‌ను మిషిన్స్‌లో వేస్తే బాటిల్స్ అన్నీ క్రిస్టల్స్ రూపంలోకి మారుతాయి. ఈ క్రిస్టల్స్‌ను కిలోల చొప్పు విక్రయించుకోవచ్చు. లాభాల విషయానికొస్తే... ఒక టన్ను గ్లాస్ క్రిస్టల్స్ రూ. 8000 పలుకుతుంది. అయితే దీని తయారీకి మనకు అయ్యే ఖర్చు కేవలం రూ. 3000 మాత్రమే. అంటే ఒక టన్ను క్రిస్టల్స్ విక్రయిస్తే సుమాఉ రూ. 5000 వరకు లాభం ఉంటుంది. నెలకు తక్కువలో తక్కువగా 10 టన్నుల క్రిస్టల్ అమ్మితే రూ. 50 వేలు సంపాదించవచ్చు.