Gold Rate Today: 'గోల్డెన్' న్యూస్.. వరుసగా 4వ రోజు తగ్గిన బంగారం ధర, తులం ఎంతుదంటే..
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు (నవంబర్ 15) బంగారం ధరలు (Gold Rate) మరోసారి తగ్గాయి.
Gold Rate Today: మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. ఒకానొక సమయంలో తులం బంగారం ధర రూ. లక్షకు చేరుతుందన్న వార్తలు వచ్చాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం, డాలర్ విలువ ఒక్కసారిగా పెరగడంతో బంగారం ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది.
కాగా శుక్రవారం కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 1200 తగ్గింది. ఇక వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై రూ. 1500 తగ్గింది. మరి దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బంగారం ధరలు..
దేశరాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,790కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.69,490 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 75,640కాగా 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69,340గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 75,640కాగా, 22 క్యారెట్ల బంగారం రూ. 69,340 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 75,640, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69,340 వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,640గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,340 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 75,640 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69,340 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇక వెండి ధరలో కూడా తగ్గుదల కనిపించింది. ఈరోజు ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 89,400 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 98,900గా ఉంది.