Gold and Silver prices today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి
Gold and Silver prices today : దేశంలో మరోసారి బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా దిగివచ్చాయి. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు మరోసారి తగ్గాయి. సోమవారం స్వల్పంగా తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గింది. రూ. 69, 340కి చేరుకుంది. ఆదివారం ఈ ధర రూ. 69, 350గా ఉంది.
ఇక 100 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 6,93,400గా ఉంది. గ్రాము బంగారం ధర ప్రస్తుతం 6,934గా పలుకుతోంది. మరోవైపు 24క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 10 దిగివచ్చింది. రూ. 75,640వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 75,650గా ఉంది. అదే సమయంలో వంద గ్రాముల బంగారం ధర రూ. 100 దిగివచ్చి రూ. 7,56,400గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 7,564గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69, 490గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75, 790గా ఉంది. కోల్ కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69, 340 పలుకుతోంది.
24క్యారెట్ల బంగారం 75, 640గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 22క్యారెట్ల బంగారం ధర రూ. 69, 340గా, 24క్యారెట్ల బంగారం ధర రూ. 75, 640గా ఉంది. బెంగళూరులో 22క్యారెట్ల బంగారం ధర రూ. 69, 340గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75, 640గా ఉంది.
హైదరాబాద్ లో ప్రస్తుతం 22క్యారెట్ల బంగారం ధర రూ. 69, 340గా ఉండగా..24క్యారెట్ల బంగారం పసిడి ధర రూ. 75, 640గా నమోదు అయ్యింది. విజయవాడలో సైతం ఈ ధరలు కొనసాగుతున్నాయి. విశాఖలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
దేశంలోని వెండి ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం వంద గ్రాముల వెండి రూ. 8,940 ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 89, 400 కొనసాగుతోంది. ఆదివారం కూడా ఇదే ధర ఉండేది.