PM Kisan 19th Installment: 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే రైతులు తప్పని సరిగా ఇలా చేయాల్సిందే..!

PM Kisan 19th Installment: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పెద్ద సంఖ్యలో రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

Update: 2024-11-18 09:50 GMT

PM Kisan 19th Installment: 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే రైతులు తప్పని సరిగా ఇలా చేయాల్సిందే..!

PM Kisan 19th Installment: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పెద్ద సంఖ్యలో రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ప్రతి సంవత్సరం కోట్లాది మంది రైతులు ఈ పథకం కింద పెట్టుబడి సాయాన్ని పొందుతున్నారు. ఇందులో అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. మీరు కూడా ఈ పథకానికి అర్హత కలిగి ఉంటే, మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథనం ప్రయోజనం పొందవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు విడుదల కానున్నాయి.

అయితే ముందుగా ఈ విడత లబ్ధి పొందుతామా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. దీని కోసం పథకంతో అనుబంధించబడిన రైతులు తమ స్టేటస్ తనిఖీ చేసి, వారికి 19వ విడత ప్రయోజనం లభిస్తుందో లేదో తెలుసుకోవచ్చు. తదుపరి స్లయిడ్‌లలో మీరు మీ స్థితిని ఎలా చెక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో చేరిన రైతులకు ఏడాదికి రూ. 6,000 ఇస్తారు. అయితే ఈ-కేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్, ఆధార్ లింకింగ్ వంటి ఇతర పనులను పూర్తిచేసిన రైతులకు మాత్రమే ఈ డబ్బు ప్రయోజనం ఉంటుంది. ఈ పనులను పూర్తి చేయకుంటే ఈ రోజే వాటిని కంప్లీట్ చేయాలి. తద్వారా ప్రధాని మోడీ పంపించే డబ్బులను పొందుతారు.

రైతులు తమ స్థితిని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు.

స్టెప్ 1

* మీకు 19వ వాయిదా వస్తుందా లేదా అనేది కూడా తెలుసుకోవాలంటే. దీని కోసం లబ్ధిదారులు తమ స్థితిని తనిఖీ చేయవచ్చు.

* స్థితిని తనిఖీ చేయడానికి ముందుగా మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

* ఇక్కడ మీరు అనేక ఆప్షన్లను చూడవచ్చు.

స్టెప్ 2

* వెబ్‌సైట్‌లో కనిపించే ఆప్షన్‌లలో 'నో యువర్ స్టేటస్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* అప్పుడు మీరు మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఇక్కడ నమోదు చేయాలి

* రైతులు దరఖాస్తు చేసినప్పుడు పొందేదే ఈ రిజిస్ట్రేషన్ నంబర్.

స్టెప్ 3

* దీని తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసిన క్యాప్చా కోడ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

* ఇప్పుడు మీకు ఇక్కడ 'గెట్ డిటైల్స్' బటన్ కనిపిస్తుంది, దానిపై మీరు క్లిక్ చేయాలి.

* మీరు ఇలా చేసిన వెంటనే, మీ స్థితిని మీరు చూస్తారు. మీకు ఈ విడుత ప్రయోజనం లభిస్తుందో లేదో మీకు తెలుస్తుంది.

Tags:    

Similar News