Business Idea: ఖాళీ స్థలం ఉందా.? ఈ మొక్కలు పెంచితే బిందాస్‌గా ఉండొచ్చు..
Business Idea: ప్రస్తుతం చాలా మంది రిటైర్‌మెంట్ కోసం ఆలోచిస్తున్నారు. ఉద్యోగం మొదలైన రోజు నుంచే విరమణ తర్వాత జీవితం ఎలా ఉండాలో లెక్కలు వేసుకుంటున్నారు.
Business Idea: ప్రస్తుతం చాలా మంది రిటైర్‌మెంట్ కోసం ఆలోచిస్తున్నారు. ఉద్యోగం మొదలైన రోజు నుంచే విరమణ తర్వాత జీవితం ఎలా ఉండాలో లెక్కలు వేసుకుంటున్నారు. అందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. కొందరు పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే మరికొందరు భూములు విక్రయించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. రిటైర్‌మెంట్ తర్వాత కూడా మంచి ఆదాయం వచ్చేలా బిజినెస్ ప్లాన్ చేసుకుంటే జీవితం చివరి క్షణంలో బిందాస్‌గా ఉండొచ్చు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.
నిమ్మకాయల సాగు చేపట్టడం ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చు. కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ డిమాండ్ ఉండే నిమ్మకాయలతో ఊహకందని లాభాలు పొందొచ్చు. అయితే దీనిని పెద్ద స్థాయిలో చేపట్టాలనేం లేదు. మీకు చిన్న స్థలంలో కూడా కొన్ని మొక్కలు నాటి ఎంచక్కా రోజువారీ ఆదాయం కూడా పొందొచ్చు. ఉద్యోగ విరమణ తర్వాత టైంపాస్‌గా మొక్కలు పెంచుతూనే లాభాలు పొందొచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో నిమ్మకాయం దాదాపు రూ. 3 పలుకుతోంది. సమ్మర్‌లో అయితే ఇది ఏకంగా రూ. 5 వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. చిన్న స్థలంలో కూడా కొన్ని నిమ్మ మొక్కలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదాహరణకు మీకు ఒక 500 గజాలు ఉన్నా అందులో కనీసం 10 మొక్కలైనా పెంచుకోవచ్చు. మార్కెట్లో నిమ్మ మొక్కలు రూ. 30 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇక వీటికి నీరు కూడా తక్కువే అవసరపడుతుంది. అదే విధంగా ప్రతీరోజూ వీటి అమ్మకాలు కచ్చితంగా ఉంటాయి.
స్థానికంగా ఉండే మార్కెట్లో నిమ్మకాయలను విక్రయించుకుంటే రోజువారీ లాభాలు పొందొచ్చు. సాధారణంగా నిమ్మ మొక్కలను పెంచడం మొదలు పెట్టిన మూడేళ్ల తర్వాత దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి పదవి విరమణ తర్వాత మంచి ఆదాయం కావాలనుకునే వారు ఇప్పుడే నిమ్మ మొక్కలను పెంచుకునే ప్రయత్నాన్ని మొదలు పెట్టడం ఉత్తమంగా చెప్పొచ్చు.