Gold Rate Today: నేలచూపులు చూస్తోన్న బంగారం ధర ..ఎంత తగ్గిందంటే

Update: 2024-11-17 01:34 GMT

Gold Rate Today: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధర..తులం లక్ష దాటడం ఖాయం

Gold Rate Today: బంగారం ధర భారీగా పెరిగి పసిడి ప్రియులకు చుక్కలు చూపించింది. కానీ గత వారం రోజులుగా నేలచూపులు చూస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో గత నెల 30వ తేదీన పది గ్రాముల బంగారం ధర రికార్డు స్ధాయిలో రూ. 81,800 పలికింది.

దాంతో డిసెంబర్ నాటికి పది గ్రాముల బంగారం ధర రూ. లక్షకు చేరుతుందన్న అంచనాలు కూడా వినిపించాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ. 75,650కి దిగి వచ్చింది. కేవలం 17 రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధర రూ. 6,150 తగ్గింది.

అక్టోబర్ జీవితకాల గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధర చూసి పసిడి ప్రియులు బంగారం కొనే ఆలోచనను సైతం పక్కన పెట్టేశారు. దీంతో ఈ ఏడాది ధన త్రయోదశి కూడా బులియన్ మార్కెట్ కు పెద్దగా కలిసి రాలేదు. పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో కొనుగోళ్లు మళ్లీ ఊపందుకుంటున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ధర తగ్గడంతో మెట్రో నగరాలతోపాటు చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లోని నగర దుకాణాలకూ ప్రస్తుతం భారీగా రద్దీ పెరిగింది. మరోవైపు పసిడి ధర తగ్గడంతో పెళ్లిళ్ల కోసం చేసే నగల బడ్జెట్ తగ్గిందని వధూవరుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నగర వ్యాపారులూ కొనుగోలు దారులను ఆకర్షించేందుకు ఎన్నో ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు.

బులియన్ మార్కెట్ ప్రస్తుతం బేరిష్ గా ఉన్నా..దీర్ఘకాలిక పెట్టుబడులకు మాత్రం ఇదే సరైన సమయమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పరిస్థితులు మిషమిస్తే ఔన్స్ బంగారం ధర 2025లో 3,000 డాలర్లని కూడా తాకే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Tags:    

Similar News