స్టాక్ మార్కెట్ కు వరుసగా ఐదో రోజూ నష్టాలే... 23,600 దిగువకు నిఫ్టీ
వరుసగా ఐదో రోజూ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 1100 పాయింట్లు పతనమైంది
స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిశాయి. అక్టోబర్ లో 14 నెలల గరిష్టానికి చేరడంతో ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గవనే అంచనాలు మదుపర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ ల నుంచి ప్రతికూల సంకేతాలు, రూపాయి విలువ పడిపోవడం కూడా ఇందుకు కారణం.దీంతో వరుసగా ఐదో రోజూ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 1100 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ కూడా 23,600 దిగువకు చేరింది. బుధవారం ఉదయం78,495.53 పాయింట్ల నష్టాలతో ప్రారంభమైంది.నష్టాలతోనే రోజంతా కొనసాగింది. తర్వాత కొంత కోలుకొని 984 పాయింట్ల నష్టంతో 77,690.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 324 పాయింట్ల నష్టంతో 23,559.05 వద్ద స్థిరపడింది.