Onion Price: సామాన్యులకు ఊరట.. ఉల్లి ధరల నియంత్రణపై కేంద్రం ఫోకస్..!
Onion Price: ఉల్లి లేని కూరను ఊహించుకోవడం అసాధ్యమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Onion Price: ఉల్లి లేని కూరను ఊహించుకోవడం అసాధ్యమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 'తల్లి చేయని మేలు, ఉల్లి చేస్తుందని' ఓ సామెత ఉండనే ఉంది. ఉల్లితో ఆరోగ్యానికి జరిగే మేలు అలాంటిది మరి. అందుకే ఉల్లి ధరలు పెరిగనప్పుడల్లా అది పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తుంది. ఉల్లి ధరల నియంత్రణ విషయంలో ప్రభుత్వాలు సైతం చర్యలు తీసుకుంటాయి. తాజాగా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి.
ఉల్లి కొనుగోలు చేయలేక పేదలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉల్లి ధరల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దేశంలో ఉల్లి ధరలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్స్ నుంచి రిటైల్ మార్కెట్లోకి ఉల్లిని తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో మార్కెట్‌లో ఉల్లి సరిపడ అందులబాటులోకి తీసుకొస్తారు. తదర్వా ఉల్లి ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
గత కొన్ని రోజులుగా ఉల్లి సరఫరా తగ్గింది. అయితే పండుగల సీజన్ కావడంతో ఉల్లికి డిమాండ్ పెరిగి ధరలు ఎక్కువయ్యాయి. దేశంలో కొన్ని చోట్ల కిలో ఉల్లి రూ. 90 నుంచి రూ. 120 వరకు అమ్ముడైంది. పెరిగిన ధరలను తగ్గించే ఉద్దేశంతోనే బఫర్ స్టాక్స్ నుంచి రిటైల్ మార్కెట్లోకి ఉల్లి నిల్వలను భారీ మొత్తంలో సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పెరిగిన ధరల నుంచి పేదలకు విముక్తి కల్పించేందుకు చెన్నై, ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో 15 లక్షల టన్నుల ఉల్లిని విక్రయించారు. అదేవిధంగా రైలు, రోడ్డు రవాణా మార్గాల ద్వారా ఎన్సీసఎఫ్ ఈ ఉల్లి నిల్వలను దేశం నలుమూలలకు సరఫరా చేయనుంది. దీంతో ఉల్లి ధరలు క్రమంగా అదుపులోకి తీసుకొస్తున్నారు.