Stock Market Today: ఒక్కసారిగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
Stock Market Today: క్రూడ్ ఆయిల్ కేంద్రంగా ఉన్న పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.
Stock Market Today: క్రూడ్ ఆయిల్ కేంద్రంగా ఉన్న పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత నాలుగు రోజులుగా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా పదకొండు వందల పాయింట్లు నష్టపోగా... నిఫ్టీ 400 పాయింట్లు నష్టాల్లో మునిగాయి. పలు రంగాలకు చెందిన షేర్లు వరసుగా నష్టాలపాలయ్యాయి.
సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ, టైటాన్, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ మినహా మిగిలిన స్టాక్స్ అన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.91 వద్ద ప్రారంభమైంది.