Stock Market Closing Bell: బ్లాక్ ఫ్రైడే.. వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ల నష్టాల బాట

Stock Market Closing Bell: స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరుసగా రెండో రోజూ భారీగా పతనమయ్యాయి.

Update: 2024-10-04 12:53 GMT

Stock Market Closing Bell

Stock Market Closing Bell: స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరుసగా రెండో రోజూ భారీగా పతనమయ్యాయి. పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్ తో పాటు విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లు చైనా మార్కెట్ల వైపు మొగ్గుచూపడంతో దలాల్ స్ట్రీట్ డీలా పడింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. యుద్ధ అలజడి, చైనా స్టిములస్ ప్యాకేజ్ తో కేవలం ఐదు ట్రేడింగ్ సెషన్స్ లోనే సెన్సెక్స్ ఏకంగా 4100 పాయింట్లు పడిపోయింది.

ఇక అమ్మకాల ఒత్తిడితో ఇవాళ సెన్సెక్స్ 808 పాయింట్ల నష్టంతో 81,688 పాయింట్ల వద్ద క్లోజవగా, నిఫ్టీ 235 పాయింట్లు కోల్పోయి 25014 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక స్టాక్ మార్కెట్లు మరికొన్ని రోజుల పాటు ఒడిదుడుకులతో సాగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Tags:    

Similar News