Gold Rate Today: నేడు బంగారం ధరకు కళ్లెం.. స్థిరంగానే పసిడి ధర

Gold Rate Today : బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. నిన్నటితో పోల్చి చూస్తే పసిడి ధర కేవలం 50 రూపాయలు మాత్రమే తగ్గింది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,670 రూపాయలు పలుకగా..అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 71,870 రూపాయలు పలికింది.

Update: 2024-10-06 03:00 GMT

బంగారం ధర ప్రధానంగా పెరగడానికి ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకడానికి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణమే ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు దీనికి తోడు ప్రస్తుతం దసరా ప్రారంభం నుంచి దీపావళి వరకు ఫెస్టివల్ సీజన్ నడవనుంది. ఈ సీజన్లో బంగారం ధరలు అత్యధికంగా పలుకుతాయి దీంతో పసిడి ధర ప్రతిరోజు సరికొత్త రికార్డును నమోదు చేస్తోంది.

అయితే బంగారం ధరలు గత సంవత్సరంతో పోల్చి చూస్తే దాదాపు 15 వేల రూపాయలు పెరిగింది. గత ఏడాది ఇదే సమయానికి బంగారం ధర 24 క్యారెట్ల గాను 10 గ్రాములకు 63000 సమీపంలో ఉంది. ఇక గత ఐదు సంవత్సరాలుగా చూస్తే బంగారం ధర దాదాపు 120 శాతం పెరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే బంగారం చరిత్రలోనే అత్యంత వేగంగా పెరిగిన కాలంగా చెప్పవచ్చు.

కరోనా సమయంలో బంగారం ధర చాలా వేగంగా పెరిగింది. మళ్లీ ఈ సంవత్సరమే బంగారం ధర ఈ రేంజ్ లో దూసుకెళ్లింది. అయితే పెరుగుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులను కలవరానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆభరణాలు కొనుగోలు చేసే వారికి పెరుగుతున్న బంగారం ధర చుక్కలు చూపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఎవరైతే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో వారు కచ్చితంగా నాణ్యత పైన బరువు పైన దృష్టికి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఒక గ్రాము తేడా వచ్చిన పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే తప్పనిసరిగా హాల్ మార్క్ ఉన్న బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Tags:    

Similar News