Aadhar Card: మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా లేదా.. రద్దయ్యే ఛాన్స్.. ఎందుకో తెలుసా?
Aadhar Card: సిమ్ కార్డు మొదలు విమానం టికెట్ బుకింగ్ వరకు ప్రతీ ఒక్క పనికి ప్రస్తుతం ఆధార్ కార్డ్ అనివార్యం మారింది.
Aadhar Card: సిమ్ కార్డు మొదలు విమానం టికెట్ బుకింగ్ వరకు ప్రతీ ఒక్క పనికి ప్రస్తుతం ఆధార్ కార్డ్ అనివార్యం మారింది. దీంతో ఆధార్ కార్డుకు సంబంధించిన విషయాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పదేళ్ల కంటే ఎక్కువ ఉన్న ఆధార్ కార్డులో ఏవైన మార్పులు చేసుకోవాలని సూచించారు.
చివరికి ఫోటో అయినా అప్‌డేట్ చేసుకోవాలని తెలిపారు. అయితే తాజాగా ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఎలాంటి అప్‌డేట్స్ చేసుకోని ఆధార్ కార్డులను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఉచితంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ గడువును కేంద్రం పలుసార్లు పొడగిస్తూ వచ్చింది.
తాజాగా ఇందుకు చివరి తేదీగా డిసెంబర్ 14ని నిర్ణయించింది. పేరులో మార్పులు, ఫొటో మార్పులు, అడ్రెస్ మార్పులు ఇలా ఏదైనా మార్చుకోవచ్చు. డిసెంబర్ 14తో ఉచితంగా అప్‌డేట్ సేవలు ముగియనున్నాయి. ఆ తర్వాత రూ. 50 తీసుకోనున్నారు. అయితే ఆ తర్వాత కూడా ఎలాంటి అప్‌డేట్స్ చేసుకొని ఆధార్ కార్డులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కాబట్టి ఎలాంటి అప్‌డేట్స్ చేసుకోని వారు వెంటనే మార్పులు చేసుకోవడం మంచిదనే వాదనలు వినిపిస్తున్నాయి.
అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే..
ఇందుకోసం ముందుగా ఆధార్ అధికారిక పోర్టల్ https://uidai.gov.inలోకి వెళ్లాలి. అనంతరం అందులో మీ ఆధార్ కార్డు, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. తర్వాత మీరు చేయాలనుకుంటున్న మార్పును ఎంచుకొని, సంబంధిత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సింపుల్‌గా మీరే స్వయంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.