PAN-Aadhaar Linkage: కేంద్రం కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు అలా చేయకపోతే పాన్ ఆధార్ రెండూ చెల్లవు..!

PAN-Aadhaar Linkage: ఇటీవల కాలంలో పాన్ కార్డు వినియోగం తప్పనిసరిగా మారింది. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు ఉండాల్సిందే.

Update: 2024-11-11 05:45 GMT

PAN-Aadhaar Linkage: కేంద్రం కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు అలా చేయకపోతే పాన్ ఆధార్ రెండూ చెల్లవు..!

PAN-Aadhaar Linkage: ఇటీవల కాలంలో పాన్ కార్డు వినియోగం తప్పనిసరిగా మారింది. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో పాన్ కార్డులు వాడుతున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక ప్రకటనలు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి అలాంటి ప్రకటనే చేసింది. డిసెంబరు 31లోగా వాటి హోల్డర్లు అలా చేయకపోతే పాన్ ఆధార్ రెండూ పనిచేయకుండా పోతాయని ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటాయి. ప్రభుత్వాలు పథకాలు ఇచ్చేందుకు కూడా ఈ రెండు కార్డులనే పరిగణలోకి తీసుకుంటాయి. అందుకే ప్రతి ఒక్కరికీ ఈ కార్డులు అనివార్యం. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు, పాన్ లేదా ఆధార్ కార్డును ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నారు. దీనికి అడ్డకట్ట వెయ్యడానికి కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డుదారులంతా తప్పనిసరిగా రెండింటినీ లింక్ చేసి తీరాలి. ఇప్పటివరకూ చేయని వారు.. ఇప్పటికైనా చేయాల్సిందే. దీనికి కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్ నిర్ణయించింది. డిసెంబర్ 31 లోగా.. పాన్ కార్డును, ఆధార్ కార్డుకు లింక్ చేయాలని సూచించింది.

ఇలా ఇప్పటి వరకు చేయని వారి పాన్, ఆధార్ కార్డులను రద్దు చేసే అవకాశం ఉంది. అయితే.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం చాలా బలమైన కారణం కూడా ఉంది. ఇటీవల కాలంలో కొన్ని రకాల టెక్, ఫైనాన్స్ కంపెనీలు.. జనాలకు ఫోన్లు చేస్తూ లోన్లు తీసుకోమని నానా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలని కాల్స్ చేసి ఇరిటేషన్ తెప్పిస్తున్నాయి. దేశంలో కొన్ని కోట్ల మంది ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అక్రమ కాల్స్, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర హోంశాఖ.. ఆదాయపు పన్ను శాఖకు ప్రత్యేక ఆదేశాలిచ్చింది. వ్యక్తుల వ్యక్తిగత డేటాను ఎవరికీ చేరకుండా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదివరకు ఫిన్‌టెక్, లోన్ కంపెనీల వంటివి.. వ్యక్తుల పాన్ కార్డ్ వివరాను వాడుకుని.. కస్టమర్ ప్రొఫైల్స్ తయారుచేసేవి. తద్వారా తమ బిజినెస్ నిర్వహించుకునేవి. దీనివల్ల వ్యక్తులకు తెలియకుండానే.. వారి పాన్ కార్డు వివరాలను లోన్లు ఇచ్చేందుకూ, తీసుకునేందుకూ వాడేస్తున్నారు. ఇదంతా చట్ట విరుద్ధమే. దీనిపై ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమైంది. అందుకే కొత్త నిబంధనలు వచ్చేశాయ్. ఎవరైనా అనుమతి లేకుండా ఇతరుల పాన్ వివరాలు, ఆధార్ వివరాలను వాడుకుంటే.. జైలు శిక్షతో పాటు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

నవంబర్ 6 నుంచి దేశవ్యాప్తంగా కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ప్రజలు పాన్ కార్డు, ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి. ఇందుకు డిసెంబర్ 31 వరకూ గడువు ఉంది కాబట్టి.. వీలు చూసుకొని.. ఇన్‌కంటాక్స్ సైట్‌ (https://www.incometax.gov.in/iec/foportal)లోకి వెళ్లి.. పాన్ కార్డుకి ఆధార్ కార్డు నంబర్ ఇచ్చి, లింక్ చేసుకోవచ్చు. ఇలా చెయ్యని వారికి.. డిసెంబర్ 31 తర్వాత పాన్ కార్డు పనిచేయదని కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News