Gold Rate Today: మళ్లీ తగ్గిన బంగారం ధర..మహిళల కళ్లలో ఆనందం..ఎంత తగ్గిందంటే?
Gold Rate Today: బంగారం ధర మళ్లీ తగ్గింది. బంగారం కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈమధ్యే ఇటీవల బంగారం ధర భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రేటు వద్ద ధర స్థిరంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈక్రమంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. నేడు నవంబర్ 11వ తేదీన హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం అంటే భారతీయులకు ఎంత ఇష్టమూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఏ పండగైనా, శుభకార్యమైనా, పెళ్లిళ్లు, పర్వదినాల్లో బంగారం తప్పకుండా ఉండాలి. మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రతిఏటా బంగారం ధరలు రికార్డ్ స్థాయికి బంగారం ధరలు చేరుకున్న సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ఒక్కరోజే తులం బంగారం ధర రూ. 1650 మేర తగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాస్త పెరిగినట్లు కనిపించినా మళ్లీ తగ్గుతూ వస్తోంది. క్రితం రోజు స్వల్పంగా తగ్గి స్థిరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నవంబర్ 11వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ఎంత రేటు ఉందో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు క్రితం రోజు తగ్గింది. నేడు అవే ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 72, 750 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఢిల్లీ మార్కట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72, 900 వద్ద ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఢిల్లీలో రూ. 79, 510 వద్ద స్థిరంగా ఉంది.
అటు వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ. 1,03,000 వద్ద ఉంది. ఇక ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 94వేల దగ్గర స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ట్యాక్సులు జీఎస్టీ వంటివి కూడా కలపలేదు. ఈ పన్నులు ప్రాంతాలను బట్టి మారుతాయి. ఈ కారణంగా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. మీరు బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ధరల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.