Gold Rate Today: ఆల్ టైం రికార్డ్ స్థాయికి బంగారం ధరలు..తులంపై ఎంత పెరిగిందంటే?

Gold Rate Today: బంగారం ధర భారీగా పెరిగి ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకింది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర 500 రూపాయల వరకు పెరిగింది. దీంతో సరికొత్త ఆల్ టైం రికార్డు ధర నమోదయింది. నేడు అక్టోబర్ 2 బుధవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.78,180 వద్ద నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 71,300 వద్ద నమోదు అయ్యింది.

Update: 2024-10-02 02:04 GMT

పసిడి ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అమెరికా మార్కెట్లో పసిడి ధర ఒక ఔన్సు.2700 డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణ నెలకొని ఉన్న నేపథ్యంలో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా వాణిజ్యం యుద్ద వాతావరణ కారణంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొని ఉంది.

ఈ నేపథ్యంలో వారంతా తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించే అవకాశం ఉంటుంది. బంగారం అనేది సేపెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు. ఫలితంగా బంగారానికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీని దృష్టిలో ఉంచుకొని బంగారం ధర తొలిసారిగా రికార్డు స్థాయిలో 78,000 రూపాయల ఎగువన నమోదయ్యింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులు కారణం అని చెప్పవచ్చు.

అమెరికాలో రాబోయే అధ్యక్ష ఎన్నికలలోగా బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధర ఇక దేశీయంగా చూస్తే దసరా నవరాత్రులు ప్రారంభం అయ్యాయి ఈ సీజన్లో బంగారం పెద్ద ఎత్తున కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మన దేశంలో బంగారం ధరలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది.

ఇక ఈనెల ధన త్రయోదశి దీపావళి పండుగలు ఉన్నాయి ఈ పర్వదినాల్లో కూడా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఈ నెలాఖరు నాటికి 85 వేల రూపాయల నుంచి 90 వేల రూపాయల మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు

Tags:    

Similar News