Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర దాదాపు 100 రూపాయలు పెరిగింది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,680గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,210గా ఉంది.

Update: 2024-10-05 01:24 GMT

అయితే బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైం రికార్డ్ స్థాయి సమీపంలో ఉన్నాయి. ఇక్కడి నుంచి బంగారం ధర ఎంత పెరిగినా అది సరికొత్త రికార్డు అవుతుంది. ఇప్పటికే బంగారం ధర ఒకసారి 78,000 మార్కును దాటింది. అయితే ప్రస్తుతం బంగారం ధర రెండు మూడు సెషన్లుగా స్థిరంగా ఉంది. కానీ బంగారం ధర సమీప భవిష్యత్తులో మాత్రం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. దీని కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై నేరుగా పడే అవకాశం ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లలో కూడా పతనం ఉండే అవకాశం ఉంటుంది.

ఈ కారణంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్లు అదేవిధంగా ఇతర ఎసెట్ క్లాసెస్ నుంచి బంగారం వైపు తరలిస్తారు. ఎందుకంటే బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధారణంగా భావిస్తారు. బంగారం ధర పెరుగుదలకు దేశీయంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. దసరా నవరాత్రుల నుంచి ఈ సీజన్ డిసెంబర్ చివరి వరకు ఉంటుంది.

ముఖ్యంగా దీపావళి, ధన త్రయోదశి నాడు బంగారం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే బంగారం ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

Tags:    

Similar News