Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే
Gold Rate Today: అక్టోబర్ 4 శుక్రవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ బంగారం ధర నేటికి కూడా 78 ఎగువన ట్రేడ్ అవుతోంది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,050 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71900 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
Gold Rate Today: అక్టోబర్ 4 శుక్రవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ బంగారం ధర నేటికి కూడా 78 ఎగువన ట్రేడ్ అవుతోంది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,050 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71900 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
బంగారం ధర ప్రధానంగా పెరగడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల్లో ఒక కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య నెలకొండ యుద్ధ వాతావరణం కారణంగా బంగారం ధర విపరీతంగా పెరుగుతూ వస్తుంది. అంతర్జాతీయంగా పెట్టుబడులు కుంటుపడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు.
బంగారం పెరగడానికి మరో ప్రధాన కారణం చైనా ఆర్థిక ఉద్దీపనలు చేపట్టిన నేపథ్యంలో బంగారానికి కూడా డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణం లభించింది. ఇది ఇలా ఉంటే బంగారం ధర చరిత్రలోనే తొలిసారిగా 78 వేల రూపాయలు దాటింది. గతంలో ఎప్పుడు కూడా బంగారం ధర ఎందుకు ఎదగలేదు. ఈ సంవత్సరమే బంగారం ధర తొలిసారిగా 75 వేల రూపాయలు దాటినప్పుడు ఆల్ టైం గరిష్ట స్థాయి కనిపించింది.
కానీ అక్కడి నుంచి కూడా బంగారం ధర నెమ్మదిగా తగ్గుతూ 67 వేల వరకు పతనమైంది. మధ్యలో కేంద్ర ప్రభుత్వం బంగారం ఎగుమతులపై సుంకం తగ్గించడంతో ఒకసారిగా బంగారం ధరలు తగ్గుముఖం పడ్డాయి. కానీ జూలై నెల నుంచి బంగారం ధర వరుసగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మాత్రం బంగారం ధర ఏకంగా ఆల్ టైం రికార్డు స్థాయిని సృష్టించింది. అయితే ఇక్కడి నుంచి బంగారం ధర ఎంత వరకు పెరగవచ్చు అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలగవచ్చు.
బంగారం దీపావళి నాటికి ఇదే ట్రెండు కొనసాగినట్లయితే దాదాపు 85 వేల రూపాయల వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర 1 లక్ష రూపాయలు దాటిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా వేలల్లో నష్టపోయే ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరిస్తున్నారు. హాల్ మార్క్ బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.