KVP Scheme: రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 10 లక్షలు పొందొచ్చు.. సూపర్ స్కీమ్..!
Kisan Vikas Patra: సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు.
Kisan Vikas Patra: సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు. వారి వారి ఆధాయ మార్గాలకు అనుగుణంగా ఎంత కొంత డబ్బును పొదుపు చేస్తుంటారు. అయితే కష్టపడి సంపాదించిన సొమ్మును ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి పెట్టడానికి భయపడుతుంటారు. అందుకే నమ్మకమైన మార్గాల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. రకరకాల పేర్లతో మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బును డబుల్ చేసే మంచి పథకం ఒకటి అందుబాటులో ఉంది. అదే కిసాన్ వికాస్ పత్ర పథకం. ఈ పథకంలో పెట్టుబడి పెడితే తక్కువ వ్యవధిలోనే రెట్టింపు సొమ్మును పొందొచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ఈ కిసాన్ వికాస్ పత్ర పథకం 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. ఈ పథకంలో సింగిల్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి పెట్టుబడి పెట్టి అలాగే ఉండాలి. నిర్ణీత కాలంలో మీరు పెట్టుబడి పెట్టిన సొమ్ము డబుల్ అవుతుంది. 115 నెలల తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం డబుల్ అవుతుంది. ఉదాహరణకు మీరు రూ. 5 లక్షలు సింగిల్ ఇన్వెస్ట్ మెంట్ చేశారనుకుందాం. ప్రస్తుత రేటు ప్రకారం 115 నెలలకు రూ.10 లక్షలు అవుతుంది.
అయితే ఈ పథకంలో సింగిల్ లేదా జాయింట్ ఖాతాను కూడా తెరవచ్చు. ముగ్గురు వ్యక్తుల వరకు జాయింట్ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు నామినీ వివరాలను సైతం అందించాల్సి ఉంటుంది. ఒకవేళ పెట్టుబడిదారుడు దురదృష్టవశాత్తూ మరణిస్తే నామినీకి రాబడి అందిస్తారు. ఈ పథకంలో రూ. వెయ్యి నుంచి డబ్బులు పెట్టుబడి పెట్టొచ్చు. చక్రవడ్డీ పద్ధతిని ఉపయోగించడం వల్ల ఎక్కువ రాబడి వస్తుంది.