Gold Rate Today: కాస్త దిగొచ్చిన బంగారం.. నిలకడగా వెండి!

gold-rate-today-29-01-2020-gold-rates- increased-silver-rate-gold-rate-hyderabad-delhi-vijayawada-amaravathi

Update: 2020-01-29 01:18 GMT

కొన్ని రోజులుగా పైకెగుస్తున్న బంగారం ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుసగా పై పైకి వెళుతూ ఉన్న బంగారం ధరలు కాస్త ఉపశామించాయి. నిన్నటివరకూ వరుసగా భారీ పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. గత వారంలో ఒక్క రోజు కిందకు దిగివచ్చిన బంగారం ధరలు మిగిలిన రోజుల్లో పెరుగుతూనే వచ్చాయి. ఈవారం కూడా అదే బాటలో నడుస్తూ ఆందోళన కలిగించిన బంగారం ఈరోజు కాస్త దిగొచ్చింది. దీంతో ఈరోజు (29.01.2020) బంగారం ధరలు కింది చూపు చూశాయి.

స్వల్పంగా తగ్గిన బంగారం..


మార్కెట్లో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 10రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 42,230 నుంచి 42,240 రూపాయలకు ఎగసింది. అయితే,ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం  స్వల్ప తగ్గ్గుదల నమోదు చేసింది. పది గ్రాములకు 40 రూపాయలు తగ్గడంతో 38,760నుంచి 38,720 రూపాయల వద్దకు చేరుకుంది.

నిలకడగా వెండి ధరలు..


ఒకవైపు బంగారం ధరలు కొంత తగ్గినప్పటికీ.. వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పూ లేకుండా స్థిరంగా ఉన్నాయి. నిన్న పెరుగుదల నమోదు చేసిన వెండి ఈరోజునిలకడగా ఉంది. దీంతో వెండి ధరలు కేజీకి 49,600 రూపాయల  వద్ద స్థిరంగా ఉన్నాయి.

విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా.. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 42,240 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,720 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 49,600 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలోనూ..


కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగోచ్చాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 50 రూపాయలు తగ్గింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,750 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,550 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా మార్పులు లేకుండా ఉన్నాయి. దాంతో వెండి ధర కేజీకి 49,600 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29.01.2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును 

Tags:    

Similar News