ఏ పన్ను విధానం మీకు అనుకూలమైంది.. తెలుసుకోండి: ఈ- కాలిక్యులేటర్ తో ఈజీగా!
ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పాత పన్ను విధానంతో పాటు కొత్త పన్ను విధానాన్ని తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ విధానం అమలులోకి వస్తుంది. పాత విధానాన్ని ఎంచుకుంటే రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌తో పాటు సెక్షన్ 80సీ కింద వివిధ పెట్టుబడుల్లో పెట్టే రూ.1.5 లక్షల పెట్టుబడులకు మినహాయింపు ఉంటుంది. కొత్త విధానం ఎంచుకుంటే మాత్రం ఈ ప్రయోజనాలు ఉండవు. అయితే ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేనివారికి ఇది ప్రయోజనకరం అని ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే, అసలు పాత విధానంలో అయితే ఎలా పన్ను చెల్లించాల్సి వస్తుంది. కొత్తవిదానంలో ఎలా వుంటుంది? ఏది ఎంచుకోవాలి అనే మీమాంశ అందరిలోనూ ఉంది. దీని విషయంలో రిటర్న్స్ ఎలా వేసుకోవాలనే సందిఘ్నత చాలా మందిలో ఉంది. అయితే, రెందు విధానాల్నీ బేరీజు వేసి ఏది మీకు సరిపోతుందనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకునే ఏర్పాటును ఆర్థిక శాఖ చేసింది. ఈ విధానం ద్వారా మీరు పాత పద్ధతిలో పన్ను చెల్లిస్తే మంచిదా.. కొత్త విధానంలో పన్ను చెల్లిస్తే పన్ను ఆదా అవుతుందా అనేవిషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ-కాలిక్యులేటర్ ద్వారా ఈ విషయాన్ని మీరు తెల్సుకోవచ్చు.
ఈ-కాలిక్యులేటర్ ఏమిటి? ఎలా పనిచేస్తుంది?
పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాల్లో వ్యత్యాసాలను తెలుసుకునేలా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీ శాఖ ఈ-కాలిక్యులేటర్‌ను తీసుకు వచ్చింది. గురువారం ప్రారంభించిన ఈ-కాలిక్యులేటర్ ద్వారా ఏ పన్ను విధానం ప్రయోజకరమని ఎవరుకి వారే తెలుసుకోవచ్చు. ఐటీ చెల్లింపు కోసం కొత్త విధానం ఎంచుకోవాలా, పాతది ఎంచుకోవాలా అనే అంశంతో పాటూ.. ఏ విధానంలో పన్ను పోటు తగ్గుతుండానే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. రెండు ఐటీ విధానాల్లో ఏది లాభదాయకమనే విషయం తెలుసుకునేందుకు www.incometax indiaefiling.gov.in లోకి లాగిన్ అయి ఈ-క్యాలిక్యులేటర్‌ను వినియోగించుకోవచ్చు. ఇందులో తమ వయస్సు, వార్షిక స్థూల ఆదాయం, ఆదాయ వనరులు, అనుమతించిన మినహాయింపులు, తగ్గింపులు ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత పాత విధానంలో పన్ను ఎంత పడుతుంది? కొత్త విధానంలో పన్ను ఎంత పోదోచ్చు అనే అంశాల్ని మానిటర్ పై చూసుకోవచ్చు.