BSNL: బీఎస్ఎన్ఎల్ 56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్.. ఎయిర్‌టెల్, జియోలకు బిగ్ షాక్..
BSNL 54 Days Validity Plan: బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న రీఛార్జీ ప్యాక్‌లు ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ 56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ వివరాలు తెలిస్తే షాకవుతారు.

BSNL: బీఎస్ఎన్ఎల్ 56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్.. ఎయిర్‌టెల్, జియోలకు బిగ్ షాక్..
BSNL 56 Days Validity Plan: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) పెరిగిన టెలికాం ధరల తర్వాత ఎక్కువ మంది మొబైల్ యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారు. దీంతో ఈ ప్రభుత్వ దిగ్గజ కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీలో మరిన్ని కొత్త ప్లాన్స్ అందుబాటులోకి తీసుకుస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్స్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్, డేటా, ఉచిత ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం కూడా పొందుతారు.
బీఎస్‌ఎన్‌ఎల్ 56 రోజుల ప్లాన్ కూడా ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకుంటుంది. ఈ ప్లాన్ బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ యూజరలకు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ యూజర్లు కంప్లిమెంటరీ యాక్సెస్ కూడా పొందుతారు. ఇందులో బైటీవీతోపాటు 400 పైగా టీవీ ఛానల్స్ అదనపు ఖర్చు లేకుండా వీక్షించే అవకాశం ఉంది.
బీఎస్‌ఎన్‌ఎల్ 54 రోజుల ప్లాన్..
బీఎస్‌ఎన్‌ఎల్ 54 రోజుల ప్లాన్ కూడా పరిచయం చేసింది. ఈ విషయాన్ని ఎక్స్ వేధికగా షేర్ చేస్తారు. రూ.347 మాత్రమే ఇందులో అదనపు లాభాలు కూడా ఉంటాయి. అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు ఏ నెట్‌వర్క్ అయినా కాల్స్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఇందులో ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్ డేటా పొందుతారు. అంటే మొత్తం ఈ ప్లాన్‌లో మీరు 108 జీబీ డేటా 54 రోజులపాటు పొందుతారు.
ఇటీవలె బీఎస్‌ఎన్‌ఎల్ 75 వేలకు పైగా 4జీ మొబైల్ టవర్లను ఇన్‌స్టాల్ చేసింది. దీంతో నెట్‌వర్క్ కనెక్టివిటీ కూడా మరింత మెరుగవుతుంది. రానున్న కొన్ని వారాల్లోనే లక్షకుపైగా 4జీ మొబైల్ టవర్లను ఏర్పాటు చేసే దిశగా పనిచేస్తుంది.
శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా ఈ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పనిచేస్తుంది. ఈ శాటిలైట్ల ఆధారంగా వినియోగదారులు తమ మొబైల్‌కు నేరుగా సిగ్నల్స్ పొందుతారు. హోలీ పండుగ సందర్భంగా కూడా బీఎస్‌ఎన్‌ఎల్ హోలీ ధమాకా ఆఫర్లను ప్రకటించింది. మార్చి 31 వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. 365 రోజుల వ్యాలిడిటీకి హోలీ ధమాకా ఆఫర్‌లో 29 రోజులు అదనంగా వ్యాలిడిటీ పెంచింది. సిమ్ యాక్టీవ్‌గా ఉండాలనుకునే యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్ ఈ రీఛార్జీ ప్యాక్ ఎంతో బెస్ట్.