AC Under 30K: రూ.30 వేలలో బడ్జెట్ ఫ్రెండ్లీ టాప్‌ కూలింగ్ ఏసీలు.. బెట్టర్‌ పర్ఫామెన్స్..

AC Under 30K: ప్రస్తుతం ఎండాకాలం ఏసీల కొనుగోలు పెరిగింది. ఒక్కో ఏసీ వేలల్లో ఉంది. అయితే, మనదేశంలో టాప్ 3 ఏసీలు రూ.30 వేలల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఏసీ కొనుగోలు చేయాలనుకుంటే మంచి కండిషన్ ఉన్న ఈ ఏసీలను కొనుగోలు చేయండి.

Update: 2025-03-24 02:30 GMT
AC Under 30K

AC Under 30K: రూ.30 వేలలో బడ్జెట్ ఫ్రెండ్లీ టాప్‌ కూలింగ్ ఏసీలు.. బెట్టర్‌ పర్ఫామెన్స్..

  • whatsapp icon

AC Under 30K: ఎండాకాలం ఎక్కువ మంది ఏసీలు కొనుగోలు చేయాలని చూస్తారు. అంతేకాదు బడ్జెట్‌లో వస్తే బాగుండూ అని చూస్తారు. అయితే, తక్కువ ధరలోనే ఎక్కువ రోజులు పనిచేసే ఏసీలు కూడా ఉన్నాయి. అంతే కాదు మంచి కూలింగ్ టెక్నాలజీ, క్వాలిటీ. ధర కూడా బడ్జెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరూ ఓ లుక్కేయండి మరీ..

పానా సోనిక్ 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ..

పానా సోనిక్ 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్‌ ఏసీ తక్కువ బడ్జెట్‌లో ఉంది. దీని కెపాసిటీ 1 టన్ ఉంటుంది. ఇది చిన్న, మధ్య సైజు గదులకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈ ఏసీ రేటింగ్ 3 ఉంది. కరెంటు కూడా తక్కువగానే ఖర్చు అవుతుంది. ఇన్వర్టర్ టెక్నాలజీతో అందుబాటులో ఉంది. ఎక్కువ రోజులపాటు లైఫ్ వస్తుంది. ఎప్పటికప్పుడు ఏసీని ఎయిర్ క్లీన్ చేస్తూ ఉండే ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏసీలు త్వరగా కూలింగ్ అందిస్తాయి. ఇందులో స్మార్ట్ డయాగ్నోసిస్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.29,999 మాత్రమే.

వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ..

వోల్టాస్ ఇండియన్ తయారు దారు కంపెనీ. ఈ 1.5 టన్‌ ఏసీ పెద్దగదులకు సరిపోతుంది. విద్యుత్ వినియోగం కూడా నియంత్రణలో ఉంటుంది. మంచి కూలింగ్ టెక్నాలజీ కలిగి ఉంది. బయట ఎంత ఎండ వేడిమి ఉన్నా లోపల కూలింగ్ త్వరగా అందిస్తుంది. ఇందులో కూడా యాంటీ డస్ట్ ఫిల్టర్స్ అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటుంది. అలర్జీలు రాకుండా కాపాడుతుంది. టెంపరేచర్ తగ్గట్టుగా ఆటోమేటిక్‌గా స్లీప్ మోడ్ లోకి వెళ్లి పోతుంది. దీనివల్ల రాత్రి హాయిగా నిద్రపోవచ్చు. ఈ ఏసీ ధర రూ.29,490 మాత్రమే.

బ్లూ స్టార్ 0.8 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ…

మీ రూమ్ చాలా చిన్నగా ఉంటే ఈ బ్లూస్టార్‌ 0.8 ఏసీ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇందులో ఇన్వర్టర్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది 3 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉండటం వల్ల కరెంట్ బిల్లు కూడా తక్కువగానే వస్తుంది. ఈ బ్లూస్టార్‌ ఏసీలో స్మార్ట్ డిటెక్షన్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే డిటెక్ట్ చేసేస్తుంది. సెల్ఫ్ డయాగ్నొసిస్ ఫీచర్ కూడా ఉండటంతో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ వస్తుంది. ఈ బ్లూ స్టార్ ఏసీ ధర రూ.27,999 మాత్రమే.

Tags:    

Similar News