
Gold Rate Today: నేడు బంగారం ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరల్లో మార్పు,కేంద్ర బ్యాంకు బంగారం నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితం అవుతాయి. ఈ క్రమంలో నేడు మార్చి 28వ తేదీ శుక్రవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గత కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది.అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత బంగారం ధర భారీగాపెరిగింది. ఆయన తీసుకుంటున్న వరుస సంచలన నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. దిగుమతి సుంకాలను ట్రంప్ భారీగా పెంచారు. దీంతో ఇన్వెస్టర్లంతా ఒక్కసారిగా బంగారంపైపు మొగ్గుచూపడంతో బంగారం ధర రోజు రోజుకు పెరుగుతోంది.
తాజాగా హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూపాయి పెరిగింది. 10 గ్రాముల ధరరూ. 83,360గా ఉంది.24క్యారెట్ల బంగారం గ్రాముకు రూపాయి పెరిగింది. 10 గ్రాముల ధరరూ. 89,850గా ఉంది. విశాఖ, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక వెండి ధరలు చూసినట్లయితే హైదరాబాద్ లో కిలో వెంది ధర రూ. 1,10,900గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,01,900కు చేరుకుంది. ముంబైలో కిలో వెండి రూ. 1,01,900గా ఉంది. విజయవాడలో కిలో ధర రూ. 1,10,900గా ఉంది. విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి.