
Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. కొన్ని నెలలుగా పెరుగుతున్న బంగారం ధరలు మూడు రోజులుగా స్థిరంగానే ఉంటున్నాయి. అయితే భవిష్యత్తులో మాత్రం మరింత ధర పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు, రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతల నడుము బంగారం ధరల్లో మార్పులు వస్తుంటాయి. కొన్ని నెలలుగా కొండెక్కిన బంగారం ధర మూడు రోజులుగా స్వల్ప తేడాతో యాథావిధిగా కొనసాగుతోంది. ఇది బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 81,602 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 82,020 చేరింది. ముంబైలో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 81,730 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 89, 170 ఉంది. తెలుగురాష్ట్రాల్లోనూ బంగారం ధరలు యథావిధిగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 81,868 ఉంది. 24క్యారెట్ల తులం బంగారం ధర రూ. 89, 310గా కొనసాగుతోంది.
అటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధానిలో కిలో వెండి ధర 1,00,410 గా ఉండగా నేడు రూ. 99,940కిచేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలోనూ కిలో వెండి ధర సోమవారం రూ. 1,00,740 ఉంది. మంగళవారానికి రూ. 1,00,270కి తగ్గింది.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు
కోల్‌కతా- రూ.81,629, రూ.89,050
చెన్నై- రూ.81,978, రూ.89,430
కోయంబత్తూర్- రూ.81,978, రూ.89,430
బెంగళూరు- రూ.81,803, రూ.89,240
పుణె- రూ.81,739, రూ.89,170