Gold Demand: బంగారం@1,00,000.. వినియోగదారులకు భారీ షాక్?

Gold Demand: కొన్ని చోట్ల తులం ధర 90,000 కంటే దిగిపోయినా, కొనుగోళ్లలో మాత్రం పెరుగుదల కనిపించడం లేదు.

Update: 2025-04-09 15:35 GMT
Gold Demand

Gold Demand: బంగారం@1,00,000.. వినియోగదారులకు భారీ షాక్?

  • whatsapp icon

Gold Demand: ఆభరణ వ్యాపారులు, బల్క్ బయ్యర్లు.. ముఖ్యంగా జ్యువెలరీ కంపెనీలు, పెట్టుబడి సంస్థలు బంగారం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. గతంలో బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాలతో పెద్దఎత్తున నిల్వలు చేసిన వారంతా.. ఇప్పుడు తక్కువ ధరలకు అమ్మకాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది ట్రేడర్లు తమ స్టాక్‌ను తక్కువ మార్జిన్‌తో విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ధరలు ఇంకా పడిపోతాయన్న ఆందోళనతో కొత్తగా స్టాక్‌ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ప్రత్యేకించి ముంబై, కోల్‌కతా, సూరత్ లాంటి జ్యువెలరీ హబ్‌లలో రీటెయిలర్లు వెయిట్ అండ్ వాచ్ మూడ్‌లోకి వెళ్లారు. భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేవారు సైతం.. బంగారం ఈటీఎఫ్‌లు, బులియన్ ఇన్వెస్ట్‌మెంట్‌లపై ఆసక్తి చూపించడంలేదు. గత మూడు వారాల్లో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి భారీగా నిధులు వెనక్కి వెళ్లిపోవడం దీనికి ప్రధాన కారణం. ఇక వడ్డీ రేట్ల పెంపు రూమర్స్‌ కూడా పెట్టుబడిదారుల నిర్ణయానికి మరో కారణం. ఇటు షార్ట్‌టెర్మ్ బాండ్‌లు, స్టాక్ మార్కెట్ లాంటి హై లిక్విడిటీ ఉన్న ఆస్తులవైపు వారంతా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు జ్యువెలరీ ఇండస్ట్రీలో మరిన్ని సమస్యలు కూడా ఉన్నాయి. బంగారంపై ఉన్న 15శాతానికి పైగా దిగుమతి సుంకం, జీఎస్టీ లాంటివి కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అందుకే కొన్ని చోట్ల తులం ధర 90,000 కంటే దిగిపోయినా, కొనుగోళ్లలో మాత్రం పెరుగుదల కనిపించడం లేదు.

ఇటు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం బంగారం ధరలు ఏ దిశగా కదులుతాయన్నది సస్పెన్స్‌గా మారింది. ఈ ట్రెండ్ తాత్కాలికమా, లేక దీర్ఘకాలికమా అనే అంశం స్పష్టంగా తెలియకపోవడంతో వెయిట్ అండ్ వాచ్‌ మూడ్ కొనసాగుతోంది. ప్రధానంగా అమెరికాలోని ఆర్థిక విధానాలే గ్లోబల్ బులియన్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం ఇటీవల తీసుకున్న షాకింగ్ నిర్ణయాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చైనా, యూరప్‌ దేశాలపై విధించిన టారిఫ్‌లు గుబులు రేపుతున్నాయి. సాధారణంగా ట్రేడ్ వార్‌ల సమయంలో బంగారం లాంటి సురక్షిత ఆస్తులపై డిమాండ్ పెరుగుతుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. ఎందుకంటే వివిధ దేశాలతో ట్రంప్‌ టారిఫ్‌ యుద్ధానికి దిగడం ఇదేం తొలిసారి కాదు. 2016-2020మధ్య తొలి విడత పాలనలోనూ ట్రంప్‌ ఇలానే చేశారు. ఆ సమయంలో పెట్టుబడిదారులు భయంతో బంగారం వైపు పరుగులు తీశారు. దీంతో గోల్డ్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సారి మాత్రం ఇన్‌వెస్టర్లు ఆ పని చేయడంలేదు. మరోవైపు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాల ఉండడంతో పెట్టుబడిదారులు బంగారం కాకుండా బాండ్‌లు, షార్ట్‌టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లవైపు మొగ్గుచూపుతున్నారు. ఇటు ట్రంప్ పాలసీలు కూడా డాలర్‌ను బలపడేలా చేస్తున్నాయి. డాలర్ బలపడితే, బంగారం ధరలు పడిపోవడం సహజం. దీంతో బంగారం మరోసారి సేఫ్‌ పెట్టుబడిగా నిలబడటంలో తడబడుతోంది. ఈ కారణాలతో నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఇప్పట్లో ధరలు పెరగవని చెబుతుంటే.. మరికొందరు వేసవి తర్వాత పెళ్లిళ్ల డిమాండ్‌తో తిరిగి పసిడి ధరలు పెరుగుతాయని అంటున్నారు. అయితే.. ఈ రెండు అంశాలకూ ట్రంప్ పాలసీల ప్రభావం కీలకంగా మారబోతోందన్నది స్పష్టంగా చెప్పొచ్చు.

మొత్తంగా చూస్తే రానున్న రోజుల్లో బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా అన్నది వివిధ కారణాలపై ఆధారపడి ఉంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు లాంటి అంశాలు ప్రస్తుతం ధరలను ప్రెషర్‌లోకి నెట్టినా.. లాంగ్‌ టర్మ్‌లో మాత్రం పసిడి ధరలు మళ్లీ దూసుకెళ్లే అవకాశాన్ని కొట్టిపారేయలేం. పెళ్లిళ్ల సీజన్ రానుండడంతో పాటు, గ్లోబల్ మార్కెట్లో మళ్లీ అస్తిరత నెలకొంటే బంగారం మరోసారి సురక్షిత పెట్టుబడిగా ఇన్‌వెస్టర్లు భావిస్తారు.

ప్రస్తుతం తులం ధర 90 వేల దిగువన ఉన్నా, డిమాండ్ పుంజుకుంటే మళ్లీ ఒక్కసారిగా ఎగబాకే అవకాశముంది. గతంలోనూ ఇదే తరహా పరిస్థితులు కనిపించాయి. ధరలు పడిపోయిన తరువాత అంచనాలు తలకిందులుగా మారి ఊహించిన మార్క్‌ను చేరిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇప్పటి తగ్గుదలతో పసిడి తన విలువను కోల్పోతుందనుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. ఇక అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ ముంచుకొస్తే ధరలు తిరిగి పెరుగుతాయి. ఈ క్రమంలో తులం ధర లక్ష మార్క్‌ను తాకే అవకాశం కూడా ఉంటుంది!

Tags:    

Similar News