Tariff war-Investors: ట్రంప్‌ దెబ్బతో భారతీయ పెట్టుబడుదారులకు భారీ షాకులు.. ఈ లెక్కలే ఫ్రూఫ్‌!

గ్లోబల్ గ్రోత్ మందగమనం అవుతుందన్న అంచనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్ని దేశాలు కలసి వాణిజ్య తగాదాలను పరిష్కరించుకోవాలి. లేకపోతే అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత దెబ్బతింటాయి.

Update: 2025-04-15 11:07 GMT
Tariff war-Investors: ట్రంప్‌ దెబ్బతో భారతీయ పెట్టుబడుదారులకు భారీ షాకులు.. ఈ లెక్కలే ఫ్రూఫ్‌!
  • whatsapp icon

టారిఫ్ వార్ ప్రభావం ఇప్పుడు ఇండియన్ మార్కెట్లను ఊహించని స్థాయిలో దెబ్బతీస్తోంది. మిస్టర్ ట్రంప్ తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాల వల్ల పెట్టుబడిదారులు కలవరపడుతున్నారు. ప్రపంచ ఆర్థిక వాతావరణం మారిపోయింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఘర్షణలు తీవ్రంగా మారుతుండటంతో భారత పెట్టుబడిదారులు కూడా తీవ్ర నష్టాల్లో ఉన్నారు. ఏప్రిల్ మొదటి పదిహేనురోజుల్లో దేశీయ మార్కెట్‌లో 11.3 లక్షల కోట్ల రూపాయల సంపద కరిగిపోయింది. సెన్సెక్స్ దాదాపు 2 శాతం పడిపోయింది.

ట్రంప్ ప్రకటించిన భారీ దిగుమతి సుంకాలు ప్రపంచ మార్కెట్లను తుడిచిపెట్టేశాయి. మొదట అన్ని దేశాలపై సుంకాలు విధిస్తానన్న ట్రంప్, తరువాత 90 రోజులు మినహాయింపు ఇచ్చారు. కానీ చైనా మాత్రం ప్రత్యేకంగా టార్గెట్ అయింది. అమెరికా 145 శాతం దిగుమతి సుంకాలు విధించగా, ప్రతీకారంగా చైనా 125 శాతం సుంకాలతో తిప్పిచెప్పింది. ఈ తలనొప్పుల మధ్య అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులు వెనక్కి తీసుకోవడం ప్రారంభించడంతో మార్కెట్లు మరింత ఒత్తిడికి గురయ్యాయి.

భారత్‌కు చైనా లేదా అమెరికాతో నేరుగా వాణిజ్య యుద్ధం లేకపోయినా, పెట్టుబడిదారుల భావోద్వేగాలను ఈ ఉద్రిక్తతలు ప్రభావితం చేశాయి. విదేశీ పెట్టుబడుల నిష్క్రమణ, పెరిగిన ముడి చమురు ధరలు రూపాయి విలువను దెబ్బతీశాయి. రూపాయి బలహీనత దిగుమతుల ఆధారిత భారత ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని తీసుకొచ్చింది.

ఇక భవిష్యత్తులో ఈ టారిఫ్ టెర్రర్ మరింత భయానకంగా మారే ప్రమాదం ఉంది. దిగుమతులపై ఆంక్షలు పెరగడం, వస్తువుల ధరలు పెరగడం, ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ గ్రోత్ మందగమనం అవుతుందన్న అంచనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్ని దేశాలు కలసి వాణిజ్య తగాదాలను పరిష్కరించుకోవాలి. లేకపోతే అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత దెబ్బతింటాయి.

Tags:    

Similar News